పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి

Posted By:

వానాకాలం, చలికాలం వచ్చాయంటే చాలు, పిల్లల రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల వారు త్వరగా ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ముక్కు దిబ్బడ, గొంతు నొప్పి, దగ్గు వల్ల పిల్లలు పడుతుంటారు. ప్రతి చిన్న సమస్యకూ యాంటీబయాటిక్స్ వాడటం పిల్లల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే మన పూర్వీకులు సూచించిన అద్భుతమైన ఇంటి వైద్యం.. కషాయం. ఇది జలుబు, దగ్గును తగ్గించడమే కాకుండా పిల్లల రోగనిరోధక శక్తిని దృఢంగా మారుస్తుంది.

ఇక,పెద్దలు కూడా సాయంత్రం టీకి బదులుగా వారానికి 5 రోజులు అయినా ఈ కషాయం తాగితే ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. ఇది యాంటీ ఇన్ ఫ్లమేటరీ డ్రింక్. అంటే శరీరంలో వచ్చే మంట, వాపు, నొప్పిని తగ్గించే డ్రింక్. అయితే దీనిని ప్రతిరోజూ తాగడానికి ఎలా తయారుచేసుకోవాలి, జలుబు-దగ్గు వంటివి ఉన్నప్పుడు దీనిని ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Powerful Anti Inflammatory Drink How to Make Cold Cough Fighting Kashayam at Home in Telugu

కషాయం తయారీకి కావాల్సిన పదార్థాలు

-దాల్చిన చెక్క
-అల్లం
-పసుపు
-నీళ్లు
-తులసి
-పుదీనా
-మిరియాలు
-యాలక

టిఫిన్స్‌ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..

కషాయం తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద పెద్ద గిన్నె పెట్టి అందులో 2 గ్లాసులు(అర లీటరు) నీళ్లు పోసి మూత పెట్టి తక్కువ మంట మీద ఆ నీళ్లను కాగనివ్వండి.

-నీళ్లు కాగేలోగా..మిక్సీ జార్ లో లేదా రోట్లో అర ఇంచు దాల్చిన చెక్క, 1 యాలక,10 మిరియాలు వేసి బాగా దంచుకోండి. తర్వాత అందులోనే అర ఇంచు తొక్క తీసేసి కడిగిన అర ఇంచు అల్లం కూడా వేసి బాగా దంచుకోండి. మరీ మెత్తగా దంచుకోనక్కర్లేదు. కొంచెం కచ్చాపచ్చాగానే దంచుకోండి.

-దంచుకున్న మిశ్రమాన్ని స్టవ్ మీద కాగుతున్న నీళ్లలో వేసేయండి. అందులోనే చిటికెడు పసుపు కూడా వేసి ఒకసారి కలిపి మూతపెట్టి తక్కువ మంట మీద 10 నిమిషాలు మరగనివ్వాలి.

-10 నిమిషాల తర్వాత అందులో 10 పుదీనా ఆకులు, 5 తులసి ఆకులను తుంపి వేసుకోండి. ఒక వేళ మీ దగ్గర పుదీనా, తులసి లేకుంటే వదిలేయండి. ఇది పూర్తిగా ఆప్షనల్.

-ఇప్పుడు స్టవ్ ఆపేయండి. కషాయం వేడిగా తాగనక్కర్లేదు. గోరువెచ్చగా అయినప్పుడు గ్లాసులోకి ఫిల్టర్ చేసుకోండి. ఉదయం, మధ్యాహ్నాం, సాయంత్రం ఈ కషాయాన్ని గోరువెచ్చగా తాగితే చాలు జలుబు, దగ్గు సమస్యలు పోతాయి.

-కావాలనుకుంటే ఇది తాగేటప్పుడు అందులో నిమ్మరసం పిండుకోవచ్చు లేదా తేనె అయినా కలుపుకొని ఆస్వాదించవచ్చు.

-అయితే రోజూ ఈ డ్రింక్ తాగాలనుకుంటే.. తీసుకునే మసాలాల కొలత తగ్గిస్తే సరిపోతుంది. అంటే 5 మిరియాలు, పావు ఇంచు అల్లం, 1 యాలక, పావు ఇంచు అల్లం ఉండేలా చూసుకోండి.

[ of 5 - Users]
Story first published: Saturday, October 10, 2026, 8:34 [IST]
Desktop Bottom Promotion