Latest Updates
-
Viral Video: 22 ఏళ్ల కుర్రాడితో 40 ఏళ్ల మహిళ ఎఫైర్.. లేచిపోతుండగా ఏమైందంటే? -
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా! -
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.!
Weight loss Soup Recipe: కొవ్వును కరిగించి, యవ్వనంగా మార్చే అద్భుతమైన సూప్ ఇదే..
సూప్స్ అనగానే మనకు వెంటనే గుర్తుకొచ్చేది వెచ్చదనం, తక్షణ శక్తి. బరువు తగ్గాలనుకునే వారికి, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించేవారికి సూప్స్ ఒక బెస్ట్ ఆప్షన్.
ప్రముఖ పోషకాహార నిపుణురాలు, వెయిట్ లాస్ కోచ్ అయిన లీమా మహాజన్ తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఒక అద్భుతమైన రెసిపీని పంచుకున్నారు. అదే క్యారెట్- క్యాబేజీ సూప్. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఈ సూప్ ఎలా తయారు చేయాలో, దీనివల్ల మన శరీరానికి ఎటువంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ చూడండి.

క్యారెట్- క్యాబేజీ సూప్ తయారీకి కావలసిన పదార్థాలు
నూనె - 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 6
ఉల్లిపాయ - 1
క్యారెట్ ముక్కలు - 1 కప్పు
క్యాబేజీ తరుగు - 1.5 కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నీరు - 3 నుండి 4 కప్పులు
మిరియాల పొడి - ఒక చిటికెడు
కారం పొడి - అర టీస్పూన్
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా!
క్యారెట్- క్యాబేజీ సూప్ తయారీ విధానం
-ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటి గిన్నె లేదా పాన్ పెట్టుకుని అందులో ఒక టీస్పూన్ నూనె వేడి చేయండి. నూనె కాగాక సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు వేసి పచ్చివాసన పోయి, లేత గోధుమ రంగు వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి ఎర్రబడే వరకు మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో క్యారెట్, క్యాబేజీ ముక్కలు వేసి బాగా కలపండి. కూరగాయలు త్వరగా మృదువుగా మారడానికి మంటను సిమ్ లో పెట్టండి. అవి కొద్దిగా మగ్గిన తర్వాత ఒక కప్పు నీరు పోయండి.
-గిన్నెపై మూతపెట్టి, కూరగాయలను సన్నని మంటపై బాగా ఉడికించండి. క్యారెట్, క్యాబేజీ ముక్కలు పూర్తిగా మెత్తబడిన తర్వాత మూత తీసి.. అందులో రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నల్ల మిరియాల పొడి, అర టీస్పూన్ కారం పొడి వేసి బాగా కలపండి. ఆ తర్వాత స్టవ్ ఆపేయండి.
-ఉడికించిన ఈ కూరగాయల మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్ లో తీసుకుని, ఎక్కడా ముక్కలు లేకుండా మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేయండి. ఈ ప్యూరీని తిరిగి పాన్ లో వేసి, మిగిలిన నీటిని (మీకు సూప్ ఎంత చిక్కగా కావాలో దాన్ని బట్టి) కలుపుకుని ఒక పొంగు వచ్చే వరకు మరిగించండి.
అంతే ఎంతో రుచికరమైన సూప్ రెడీ. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని, పైన కొద్దిగా మిరియాల పొడి చల్లి వేడివేడిగా ఆస్వాదించండి.
ఈ సూప్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
న్యూట్రిషనిస్ట్ లీమా మహాజన్ తెలిపిన వివరాల ప్రకారం ఈ సూప్ కేవలం రుచికి మాత్రమే పరిమితం కాదు, ఇది ఒక పోషకాల గని.
బరువు తగ్గుతారు: ఇందులో కేలరీలు చాలా తక్కువగా
ఉంటాయి. పోషకాలు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల కొద్దిగా తాగినా కడుపు
నిండిన భావన కలుగుతుంది. ఇది బరువు తగ్గడానికి అద్భుతంగా
పనిచేస్తుంది.
వాపులు, ఉబ్బరం మాయం: క్యారెట్, క్యాబేజీలలో ఉండే యాంటీ
ఇన్ఫ్లమేటరీ (శోథ నిరోధక) గుణాలు శరీరంలో వాపును, పొట్ట
ఉబ్బరాన్ని తగ్గిస్తాయి.
మెరిసే చర్మం మీ సొంతం: ఈ సూప్ శరీరంలో గ్లూటాథియోన్ ఉత్పత్తిని పెంచుతుంది. దీనివల్ల చర్మం సహజంగానే కాంతివంతంగా, యవ్వనంగా మారుతుంది.
హార్మోన్ల బ్యాలెన్స్, డిటాక్స్: ఈ సూప్ శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపి బాడీని డిటాక్స్ చేయడంలో సహాయపడుతుంది. అలాగే హార్మోన్లను సహజ పద్ధతిలో సమతుల్యం చేస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
