Latest Updates
-
అద్దెకు దిగిన ఆంటీతో ఎఫైర్.. హెచ్ఐవీ సోకి ఇద్దరు అన్నదమ్ముల మృతి!..ఆమెతో పరిచయం ఉన్నవాళ్లంతా.. -
Guru nakshatra gochar: అక్టోబర్ 8న ఆశ్లేష నక్షత్రం నాల్గవ పాదంలోకి గురువు..నక్క తోక తొక్కే రాశులివే! -
రెగ్యులర్ కుర్మాకి గుడ్ బై.. పూరీలోకి కొత్త రుచులతో 'తీపి గుమ్మడికాయ కుర్మా'! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ శనగల పరాటా..రోజంతా ఎనర్జీ,బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ -
ముంబై స్ట్రీట్ స్టైల్ చీజ్ పావ్ భాజీ.. ఉల్లి, వెల్లుల్లి లేకుండా ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
పబ్లిక్‌లో ముద్దు పెట్టుకోవడం నిజంగా నేరమా.. మన భారతీయ చట్టాలు ఏం చెబుతున్నాయంటే.! -
పైన క్రిస్పీగా.. లోపల సాఫ్ట్ గా.. సాయంత్రం పూట వేడివేడి పనీర్ ఫింగర్స్ చేసుకోండిలా.. -
వంశాభివృద్ధికి, పితృదేవతల ఆశీస్సులకు మహాలయ అమావాస్య.. తర్పణం, శుభ సమయం వివరాలివే.! -
రోజూ 10 నిమిషాలు సూర్యాస్తమయాన్ని చూస్తే ఏమవుతుందో తెలుసా? -
నాటు శైలిలో ఘాటుగా 'రొయ్య పొట్టు చారు'.. పల్లెటూరి రుచుల మజానే వేరు.!
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండానే పరమ రుచిగా.. టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం చేసుకోండిలా!
గుడికి వెళ్లినప్పుడు అక్కడ ప్రసాదంగా పెట్టే సాంబార్ అన్నం రుచే వేరు. ఆ కమ్మని రుచిని, గుమగుమలను మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా చేసే ఈ టెంపుల్ స్టైల్ సాంబార్ అన్నం పండుగ రోజుల్లో లేదా ఏదైనా ప్రత్యేక దినాల్లో చేసుకోవడానికి పర్ఫెక్ట్. ఈ అద్భుతమైన వంటకాన్ని ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

సాంబార్ అన్నం తయారీకి కావలసిన పదార్థాలు
బియ్యం - అర కప్పు
మసాలా పేస్ట్ కోసం:
కందిపప్పు - పావు కప్పు
పసుపు - చిటికెడు
నీళ్లు - తగినన్ని
పచ్చి శనగపప్పు - 1 టేబుల్ స్పూన్ మినపప్పు - 1 టీస్పూన్
ధనియాలు - 1 టేబుల్ స్పూన్ మెంతులు - పావు టీస్పూన్
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు జీలకర్ర - పావు
టీస్పూన్
మిరియాలు - పావు టీస్పూన్
తాలింపు కోసం:
నువ్వుల నూనె - 1 టేబుల్ స్పూన్
ఆవాలు - అర టీస్పూన్
మెంతులు - పావు టీస్పూన్
ఎండు మిర్చి,పచ్చిమిర్చి - రుచికి తగినన్ని
ఇంగువ - కొద్దిగా
కూరగాయలు, ఇతరాలు:
క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్, తీపి గుమ్మడికాయ ముక్కలు, టమాటా
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - కొద్దిగా
సాంబార్ పొడి - 1 టీస్పూన్
చింతపండు గుజ్జు - తగినంత
చివరిగా కలపడానికి: నెయ్యి - 1 టేబుల్ స్పూన్
జీడిపప్పు - కొద్దిగా
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.!
సాంబార్ అన్నం తయారీ విధానం
-ముందుగా బియ్యం, కందిపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్లో వీటిని వేసి, చిటికెడు పసుపు, తగినన్ని నీళ్లు పోసి 5 విజిల్స్ వచ్చేదాకా మెత్తగా ఉడికించాలి. ఆ తర్వాత గరిటెతో బాగా మెదిపి పక్కన పెట్టుకోవాలి. మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వేడినీళ్లు కలుపుకోవచ్చు.
-స్టవ్ మీద పాన్ పెట్టి మసాలా పేస్ట్ కోసం చెప్పిన దినుసులన్నీ (కొబ్బరితో సహా) దోరగా వేయించాలి. చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా మిక్సీ పట్టుకోవాలి.
-తాలింపు కోసం ఒక మందపాటి గిన్నెలో నువ్వుల నూనె వేడి చేసి ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఇంగువ వేసి దోరగా వేయించుకోవాలి. ఈ పోపులో ముందుగా క్యాప్సికమ్ ముక్కలు వేసి వేయించాలి. ఆ తర్వాత మిగిలిన కూరగాయల ముక్కలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఉప్పు, పసుపు, సాంబార్ పొడి, చింతపండు గుజ్జు, గుమ్మడికాయ ముక్కలు, తగినన్ని నీళ్లు పోసి బాగా మరిగించాలి. కూరగాయలు మెత్తబడి, చింతపండు పచ్చివాసన పోయేదాకా ఉడికించాలి.
-కూరగాయలు ఉడికాక, మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. ఇది బాగా మరుగుతుండగా, మెత్తగా ఉడికించి పెట్టుకున్న అన్నం-పప్పు మిశ్రమాన్ని వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. మీకు కావలసినంత చిక్కదనాన్ని బట్టి నీళ్లు పోసుకొని, ఉప్పు సరిచూసుకోవాలి.
-చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి. చిన్న కడాయిలో వేడి నెయ్యిలో జీడిపప్పులను దోరగా వేయించి, ఆ నేతితో సహా సాంబార్ అన్నం పైన పోసి వేడివేడిగా వడ్డించుకుంటే... ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
