Latest Updates
-
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
హై ప్రొటీన్, ఫైబర్ నిండిన కినోవా జంతికలు..డయాబెటిస్, వెయిట్ లాస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్
సాయంత్రం వేళ టీ తాగుతున్నప్పుడు కరకరలాడే స్నాక్స్ తినాలని ఎవరికి ఉండదు చెప్పండి? అందులోనూ మనకు ఎంతో ఇష్టమైన జంతికలు కనిపిస్తే అస్సలు వదిలిపెట్టం. పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా రుచికరమైన స్నాక్ కావాలని అడుగుతుంటారు. అయితే బయట దొరికే జంతికలు లేదా కేవలం మైదా, బియ్యం పిండితో చేసేవి తినడం వల్ల బరువు పెరుగుతామేమో అన్న భయం చాలా మందికి ఉంటుంది.
రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే ఒక అద్భుతమైన స్నాక్ కినోవా జంతికలు. ఇవి కేవలం స్నాక్స్ మాత్రమే కాదు, హై ప్రొటీన్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆరోగ్యకరమైన ఆహారం. వీటిని ఇంట్లోనే చాలా సులువుగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కినోవా జంతికలు తయారీకి కావలసిన పదార్థాలు
కినోవా - 2 కప్పులు
మినపప్పు- అర కప్పు
బియ్యం- అర కప్పు
శనగపప్పు(పుట్నాలు)- అర కప్పు
నువ్వులు- 1 టీస్పూన్
వాము - కొద్దిగా
పచ్చిమిర్చి పేస్ట్ - మీ రుచికి తగినంత
ఉప్పు - రుచికి సరిపడా
వెన్న- కొద్దిగా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
నీళ్లు - పిండి కలుపుకోవడానికి తగినన్ని
కినోవా జంతికలు తయారీ విధానం
-ముందుగా మిక్సీ జార్ లో కినోవా, మినపప్పు, బియ్యం, పుట్నాల పప్పు వేసుకొని మెత్తటి పౌడర్ లా గ్రైండ్ చేసుకోవాలి.
-ఇప్పుడు ఆ పిండిని ఒక పెద్ద గిన్నెలో వేసుకోవాలి. అందులో నువ్వులు, చేతితో కొద్దిగా నలిపిన వాము, పచ్చిమిర్చి పేస్ట్, ఉప్పు, కొద్దిగా వెన్న వేసి అన్నీ పిండిలో కలిసేలా బాగా కలుపుకోవాలి. వెన్న వేయడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి.
-ఇప్పుడు అందులో కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ.. పిండిని మృదువుగా, చపాతీ పిండి లాగా కలుపుకోవాలి.
-స్టవ్ మీద కడాయి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. జంతికల గొట్టంలో కలుపుకున్న ఈ పిండిని పెట్టి, వేడెక్కిన నూనెలో మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న జంతికలుగా ఒత్తుకోవాలి.
-మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, రెండు వైపులా మంచి గోల్డెన్ కలర్ వచ్చి, క్రిస్పీగా మారే వరకు వేయించుకుని బయటకు తీయాలి.
-అంతే ఎంతో రుచికరమైన కినోవా జంతికలు రెడీ.
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే!
ఆరోగ్య ప్రయోజనాలు
సాధారణ జంతికలతో పోలిస్తే ఈ కినోవా జంతికలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
అధిక ప్రొటీన్: కినోవాలో మన శరీరానికి కావాల్సిన నాణ్యమైన ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ దొరుకుతుంది.
జీర్ణక్రియకు మేలు: ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
పోషకాల గని: మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ లాంటి ముఖ్యమైన మినరల్స్ ఇందులో మెండుగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
లో గ్లైసెమిక్ ఇండెక్స్: ఇవి తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవు. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు, డైట్ చేస్తూ బరువు తగ్గాలనుకునే వారు కూడా ఎలాంటి భయం లేకుండా ఆస్వాదించవచ్చు.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
