Latest Updates
-
బిర్యానీ కూడా దీనిముందు బలాదూరే..ఈ రైస్ చేశారంటే ఇంట్లో వాళ్ళు ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు! -
సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా తినే ‘ఎగ్ ఖాగినా’.. హైదరాబాద్ దాబా స్టైల్లో ఇలా చేసేయండి.! -
100 ఏళ్లు ఆరోగ్యంగా బతకాలా? ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇది తినండి! -
విమానాల్లో ‘నో స్మోకింగ్’, కానీ బాత్రూమ్ల్లో యాష్ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.! -
మీ బాడీలో షుగర్ లెవెల్స్‌ను పక్కాగా తెలిపే స్మార్ట్ పరికరాలు ఇవే.! -
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక!
మైదా వద్దు.. రాగి ముద్దు..ఆరోగ్యకరమైన కజ్జికాయల రుచి చూశారా..ఎలా చేసుకోవాలంటే
కజ్జికాయలు మన తెలుగు రాష్ట్రాల్లో ఒక సాంప్రదాయక, ప్రియమైన తీపి వంటకం. సాధారణంగా మైదా పిండితో చేసే కజ్జికాయలు టేస్ట్ పరంగా అద్భుతంగా ఉన్నప్పటికీ వాటిలో పోషక విలువలు తక్కువగా ఉంటాయి. అయితే మైదాకు బదులుగా రాగి పిండిని ఉపయోగించి రాగి కజ్జికాయలు తయారు చేసుకోవచ్చు. రాగి పిండితో చేసే కజ్జికాయలు కేవలం రుచికరంగా ఉండటమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి ఇది ఒక అద్భుతమైన ఎంపిక. రాగి కజ్జికాయలు మీ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో, వాటి ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూడండి.
రాగి కజ్జికాయలు తయారీకి కావాల్సిన పదార్థాలు
-పల్లీలు
-నువ్వులు
-రాగిపిండి
-జీడిపప్పు
-నెయ్యి
-బెల్లం
-కొబ్బరి తురుము
-శెనగపప్పు
-గసగసాలు
-ఉప్పు

రాగి కజ్జికాయలు తయారీ విధానం
-ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి అందులో అరకప్పు నువ్వులు వేయించి పక్కనపెట్టుకోండి.
-తర్వాత పాన్ లోనే అరకప్పు పల్లీలు వేసి నూనె లేకుండానే వేయించాలి. వేయించిన పల్లీలను పొట్టు తీసేసి పక్కనపెట్టుకొని చల్లారనివ్వాలి.
-తర్వాత మిక్సీ గిన్నెలో వేయించిన నువ్వులు, వేయించిన పల్లీలు, అరకప్పు వేపుడు శెనగపప్పు వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని వేసి ఇందులోనే 1 కప్పు పచ్చి కొబ్బరి తురుము,2 కప్పుల బెల్లం తురుము వేసి తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
-బెల్లం కరిగి ముద్దయ్యాక అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి, నెయ్యిలో వేయించిన 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు ముక్కలు,గసగసాలు వేసి కలిపి పక్కనపెట్టి చల్లారనివ్వాలి.
-తర్వాత స్టవ్ మీద మరో బాండీ పెట్టి అందులో 1 కప్పు నీళ్లు పోసి అందులో కొద్దిగా ఉప్పు, 1 టేబుల్ స్పూన్ బెల్లం తరుము, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక అందులో 1కప్పు రాగిపిండి వేసి 2 నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి పక్కనపెట్టి చల్లారనివ్వాలి.
-ఈ రాగి మిశ్రమం చల్లారాకా దాన్ని కొంచెం కొంచెం తీసుకొని వత్తుకొని అందులో ముందుగా తయారుచేసుకొని పక్కనపెట్టుకున్న కొబ్బరి ముద్ద మధ్యలో పెట్టి కజ్జికాయల మాదిరిగా వత్తుకోవాలి.
-తర్వాత వాటిని ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద పావు గంట సేపు ఉడికించి దించేయాలి. అంతే రాగి కజ్జికాయలు రెడీ.
ప్రయోజనాలు
రాగి పిండి ఒక పోషకాహార గని. రాగిని మన ఆహారంలో చేర్చుకోవడం వల్ల చాలాప్రయోజనాలు ఉన్నాయి. ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, ఎముకల సాంద్రతను పెంచడానికి ఇది చాలా అవసరం. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లలకు, వృద్ధులకు రాగి చాలా మంచిది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రాగిలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది, పేగు ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఫైబర్ ఆహారాన్ని నెమ్మదిగా జీర్ణం చేస్తుంది, ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడానికి సహాయపడుతుంది. బరువు నియంత్రణకు తోడ్పడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి మంచిది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
