విమానాల్లో ‘నో స్మోకింగ్‌’, కానీ బాత్‌రూమ్‌ల్లో యాష్‌ ట్రేలు తప్పనిసరి.. కారణమేంటో తెలుసా.!

రైలు, బస్సు, కారు ఇలా వాహనం ఏదైనా వాటిలో ప్రయాణం చేసేటప్పుడు ధూమపానం చేయడం చాలా ప్రమాదకరమనే విషయం తెలిసిందే. స్మోకింగ్‌ అలవాటు ఉన్నవారు తప్పనిసరిగా జర్నీ చేసేటప్పుడు వీటిని దగ్గర పెట్టుకోకూడదు. ఇది విమాన ప్రయాణాలకు కూడా వర్తిస్తుంది. కానీ ఫ్లైట్స్‌లోని వాష్‌రూమ్‌ల్లో ప్రత్యేకంగా యాష్‌ ట్రేలు ఉంటాయి. విమానాల్లో సిగరెట్లను ఎలా అనుమతిస్తారు.. ఇందుకు కారణమేంటని ఎప్పుడైనా ఆలోచించారా.. వాటికి సమాధానాలు తెలుసుకుందాం..

No smoking in aeroplanes but ash trays in bathrooms know the reasons and facts

సాధారణంగా విమానంలోకి ప్రవేశించినప్పుడు ధూమపాం నిషేధం(Smoking Prohibited) అనే ఇండికేషన్‌ తప్పకుండా కనిపిస్తుంది. అంతేకాకుండా పొగను గుర్తించే డిటెక్టర్‌ కూడా ఉంటుంది. కానీ లోపలికి వెళ్లాక రెస్ట్‌రూమ్‌కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఒక చిన్న లోహపు యాష్‌ ట్రేను గుర్తిస్తారు. ఇక్కడే మీకు డౌట్‌ రావచ్చు. ఎంట్రీలో ధూమపానం నిషేధం అని ఉంది.. రెస్ట్‌రూమ్‌లో మాత్రం ఎందుకు తాగొచ్చు అనే సందేహం తప్పనిసరిగా వస్తుంది. అసలు బాత్‌రూమ్‌లో యాష్‌ ట్రేలను ఎందుకు ఉంచుతారో ఇక్కడ తెలుసుకుందాం..

మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి!మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి!

విమానాల్లో ప్రయాణికులు భోజనం సమయంలో ఉపయోగించే టిష్యూ పేపర్స్‌, ఫుడ్‌ వేస్టేజ్‌ను చెత్త బుట్టలో పడేస్తారు. ఈ క్రమంలో స్మోకింగ్‌ అలవాటు ఉన్న వారు తమ సీట్లలోనే కూర్చుని ధూమపానం చేసి వాటిని చెత్త బుట్టలో వేసినట్లయితే అంటుకునే ప్రమాదం ఉంటుంది. అయితే అంతర్జాతీయ నిబంధనల మేరకు విమానాల్లో ధూమపానానికి ఖచ్చితంగా నిషేధం ఉంది.

No smoking in aeroplanes but ash trays in bathrooms know the reasons and facts

కాగా, విమాన జర్నీ గంటల పాటు కొనసాగుతుంది. మధ్యలో ఆగే అవకాశం లేనందున సిగరెట్‌ అలవాటు ఉన్నవారు కంట్రోల్‌ చేసుకోలేరు. ఈ క్రమంలో వారు నిబంధనలు ఉల్లంఘించే అవకాశం ఉంది. అలాంటి వారి కోసమే వాష్‌రూమ్‌లో ప్రత్యేకంగా యాష్‌ ట్రేను తీసుకొచ్చారు. యూఎస్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాల మేరకు ఈ నియమాన్ని విమానాల్లో కఠినంగా అమలు చేస్తున్నారు. ఇంకా అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు విమానాల్లో స్మోక్‌ డిటెక్టర్లు, ఫైర్‌. ఎక్స్‌టింగ్విషర్లను సైతం అందుబాటులో ఉంటాయి.

కస్టమర్లకు అలర్ట్‌.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్‌.!కస్టమర్లకు అలర్ట్‌.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్‌.!

విమానాల్లో ఈ నియమం అమలు చేయడానికి 1973లో జరిగిన ఒక విషాద ఘటన ప్రధాన కారణం. రియో ​​డి జనీరో నుంచి పారిస్‌కు వెళ్తున్న వెరిజోన్ బోయింగ్ 707 విమానంలోని బాత్రూమ్ ప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించగా.. ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేస్తున్న సమయంలో మంటలు తీవ్రమై విమానం కూలిపోయింది. దుర్ఘటనలో 120 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రయాణికుడు విసిరేసిన సిగరెట్‌ కారణంగానే ఇది జరిగి ఉండవచ్చని ప్రాథమిక దర్యాప్తులో అనుమానం. ఈ క్రమంలో ఈ ప్రమాదాలను నివారించడానికి ఈ నియమం తీసుకొచ్చారు.

అంతర్జాతీయ విమానాలతో పాటు ఇండిగో వంటి భారత విమానాల్లో కూడా ధూమపానం నిషేదం. వాటిలో బాత్‌రూమ్‌లో ఖచ్చితంగా స్మోక్‌ డిటెక్టర్లు ఉంటాయి. ఈ క్రమంలో మీరు ఈ సారి ఫ్లైట్‌ జర్నీ చేసేటప్పుడు స్మోకింగ్‌ చేయవచ్చనే ఆలోచన పెట్టుకోకండి. అగ్నిప్రమాదాల దృష్ట్యా ధూమపానానికి నిషేధం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Story first published: Wednesday, September 23, 2026, 11:19 [IST]
Desktop Bottom Promotion