Latest Updates
-
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.!
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక!
వంట చేద్దామంటే ఇంట్లో కూరగాయలు ఏమీ లేవా? ఫ్రిజ్ తెరిచి చూస్తే కేవలం టొమాటోలు, ఉల్లిపాయలు మాత్రమే కనిపిస్తున్నాయా? ఆ రెండు పదార్థాలతోనే ఇంట్లో వాళ్లందరూ వేళ్లు నాక్కుంటూ తినేలా ఒక అద్భుతమైన వంటకం చేయవచ్చు. అదే కమ్మని టమాటా సాంబార్.
సాంబార్ అనగానే బోలెడు కూరగాయలు ఉండాలనే రూల్ ఏమీ లేదు. కేవలం టమాటాలతో చేసే ఈ సాంబార్ అమృతంలా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి మాత్రమే కాదు, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్ లోకి కూడా ఇది అదిరిపోయే కాంబినేషన్. అత్యంత సులభంగా, వేగంగా టమాటా సాంబార్ ఎలా చేయాలో ఇక్కడ చూడండి.

టమాటా సాంబార్ తయారీకి కావలసిన పదార్థాలు
పప్పు ఉడికించడానికి
కందిపప్పు - ముప్పావు కప్పు
నీళ్లు - రెండున్నర కప్పులు
పసుపు - పావు టీస్పూన్
మసాలా పొడి కోసం
ధనియాలు - 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర - 1 టీస్పూన్
మెంతులు - అర టీస్పూన్
కాశ్మీరీ ఎండు మిరపకాయలు - 2
సాంబార్ తయారీకి
నూనె - 2 టీస్పూన్లు
ఆవాలు - ఒకటిన్నర టీస్పూన్
ఉల్లిపాయ - 1 పెద్దది
పచ్చిమిర్చి - 4
కరివేపాకు - 2 రెమ్మలు
బాగా పండిన టమాటాలు - 4
సాంబార్ పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్
బెల్లం తురుము - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - తగినన్ని
కొత్తిమీర - కొద్దిగా
నెయ్యి - అర టీస్పూన్
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి!
టమాటా సాంబార్ తయారీ విధానం
-ముందుగా కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేయండి. అందులో రెండున్నర కప్పుల నీళ్లు, చిటికెడు పసుపు వేసి మూతపెట్టండి. మీడియం మంటపై 3 విజిల్స్ వచ్చేవరకు పప్పును మెత్తగా ఉడికించుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న పాన్ పెట్టి, అందులో నూనె లేకుండా ధనియాలు, జీలకర్ర, మెంతులు, కాశ్మీరీ ఎండు మిరపకాయలు వేసి మంచి సువాసన వచ్చే వరకు దోరగా వేయించండి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ మీద అడుగు మందంగా ఉన్న గిన్నె పెట్టుకుని నూనె వేయండి. నూనె వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడించండి. అందులోనే కొద్దిగా కరివేపాకు వేసి వేయించండి. ఇప్పుడు అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించండి. ఆ తర్వాత బాగా పండిన టమాటా ముక్కలను వేసి కలపండి. మూతపెట్టి సుమారు 3 నిమిషాల పాటు టమాటాలు గుజ్జులా అయ్యేవరకు ఉడికించండి.
-టమాటాలు మెత్తబడ్డాక మూత తీసి, సాంబార్ పొడి వేసి బాగా కలపండి. సాంబార్ కు సరిపడా నీళ్లు పోసి, కొద్దిగా బెల్లం వేసి మరిగించండి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా మెత్తగా ఉడికించి పెట్టుకున్న కందిపప్పును వేసి ఉండలు లేకుండా కలపండి.
-సాంబార్ బాగా మరుగుతున్న సమయంలో, మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న తాజా మసాలా పొడిని వేసి కలపండి. ఈ పొడి సాంబార్ కు అద్భుతమైన రుచిని ఇస్తుంది.
-సాంబార్ గుమగుమలాడుతూ ఉడుకుతున్నప్పుడు,మంటను సిమ్ లో పెట్టి, సన్నగా తరిగిన కొత్తిమీర, మరికొంత కరివేపాకు, అర టీస్పూన్ కమ్మని నెయ్యి వేసి స్టవ్ ఆఫ్ చేయండి.
-అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే టమాటా సాంబార్ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
