Latest Updates
-
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.!
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు!
చేతి గోర్ల విషయంలో చాలామంది కేర్ తీసుకుంటారు కానీ కాలి వేళ్ల గోర్ల విషయం చాలా నిర్లక్ష్యం వహిస్తుంటారు. సడన్ గా ఉన్నట్లుండి కాలిగోళ్లు రంగు మారినా కూడా లైట్ తీసుకుంటాు తప్ప వెంటనే ఇది ఎందుకు వచ్చిందని శ్రద్ధ పెట్టారు. అయితే మీరు కూడా ఇలాగే కాలిగోళ్ల విషయంలో అశ్రధ్ధగా ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి.
కాలిగోళ్ల రంగు మారడం అంటే..దాని వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే అని కూడా అర్థం చేసుకోవచ్చు. గోళ్ల రంగు మారడానికి కారణాలు, తీసుకోవాల్పిన జాగ్రత్తలు ఏంటో చూడండి.

టైట్ గా ఉంటే బూట్లు..గోళ్లకు ప్రాణసంకటం
చాలామంది కాలికి బిగుతుగా ఉండే షూస్ ని రోజంతా వాడుతుంటారు. దీనివల్ల వల్ల కాలివేళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. ముఖ్యంగా నడుస్తున్నప్పుడు లేదా పరుగెడుతున్నప్పుడు కాలిగోళ్లు పదే పదే బూట్లకు రాసుకోవడం వల్ల, గోళ్ల కింద ఉండే సూక్ష్మ రక్తనాళాలు చిట్లిపోయి రక్తం గడ్డకడుతుంది. దీంతో గోరు నలుపు లేదా నీలం రంగులోకి మారుతుంది. అయితే గోరు పెరిగే కొద్దీ ఈ మచ్చ నెమ్మదిగా ముందుకు జరిగిపోతుంది.
గాయాలు, ప్రమాదాలు
కాలి బొటనవేలుకు దెబ్బ తగలడం గోర్లు నల్లబడటానికి మరో ప్రధాన కారణం. తలుపు సందులో వేలు ఇరుక్కోవడం, బరువైన వస్తువులు కాలిపై పడటం లేదా ఆటలు ఆడేటప్పుడు గాయాల వల్ల గోరు కింద రక్తం చేరి నల్లగా మారుతుంది. ఒకవేళ నొప్పి, వాపు భరించలేనంతగా ఉంటే డాక్టర్ ను కలవడం ఉత్తమం.

ఫంగల్ ఇన్ఫెక్షన్ల ముప్పు
గోర్లు ఎప్పుడూ నల్లగానే మారవు. ఒక్కోసారి పసుపు, తెలుపు లేదా గోధుమ రంగులోకి కూడా మారవచ్చు. దీనికి ముఖ్య కారణం ఫంగల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ సోకితే గోర్లు అందవిహీనంగా, మందంగా, పెళుసుగా తయారవుతాయి. అంతేకాదు గోరు చుట్టూ చర్మం పొట్టులా ఊడిపోవడం, దురద, దుర్వాసన వంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
నిర్లక్ష్యం చేయకూడని మచ్చలు
కొన్నిసార్లు గోరుపై నల్లటి లేదా గోధుమ రంగు గీతలు కనిపిస్తాయి. అయితే ఈ గీత కొత్తగా ఏర్పడినా, క్రమంగా వెడల్పుగా మారుతున్నా, చర్మానికి వ్యాపిస్తున్నా వెంటనే చర్మవ్యాధి నిపుణుడిని (డెర్మటాలజిస్ట్) సంప్రదించాలి. ఎందుకంటే, అరుదైన సందర్భాల్లో ఇది మెలనోమా అనే చర్మ క్యాన్సర్ కు సంకేతం కావచ్చు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..పరిష్కారాలు
కాలిగోరు నల్లబడితే కంగారు పడకుండా పాదాలకు తగినంత విశ్రాంతినివ్వండి.
కాలివేళ్లు స్వేచ్ఛగా కదిలేలా సరైన సైజు బూట్లను మాత్రమే వాడండి.
గోరు కింద రక్తం గడ్డకడితే సూదులతో, పిన్నులతో పొడిచి తీసే ప్రయత్నం అస్సలు చేయవద్దు.
ఇన్ఫెక్షన్ ఉంటే ఇంటి చిట్కాలపై ఆధారపడకుండా, డాక్టర్ ని కలవాలి.
పాదాలను ఎల్లప్పుడూ పొడిగా ఉంచుకోవడం, రోజూ ఉతికిన సాక్సులనే ధరించడం, ఇతరుల చెప్పులు వాడకపోవడం వంటి చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే మీ కాలిగోళ్లు ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
