Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకీ గ్రహాలు, రాశుల ప్రభావం ఉంటుందని తెలిసిందే. ఇక, మనం పుట్టిన తేదీ, తిథి కూడా మన దైనందిన జీవితంపైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా దృఢంగా ఉండేందుకు జ్యోతిష్య పండితుల సలహాలను కొందరు ఎక్కువగానే పాటిస్తుంటారు. అందుకే డబ్బు అంటే మొదటగా గుర్తొచ్చేది పర్సు. అది ఇంటా బయటా ఎప్పుడూ మన వెంటే ఉంటుంది. లక్ష్మీదేవి స్వరూపంగా భావించే ఈ పర్సును ఎప్పుడూ ఖాళీగా ఉంచరు. ఈ క్రమంలో మీరు పుట్టిన తేదీ ప్రకారం మీ పర్సులో కొన్ని వస్తువులను పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని సంఖ్యాశాస్త్రం వెల్లడిస్తోంది.

సంఖ్యా శాస్త్రం ప్రకారం మీరు పుట్టిన రోజుకి అనుగుణంగా ఈ వస్తువులను పర్సులో ఉంచుకుంటే మీకు పాజిటివ్ ఎనర్జీ, అదృష్టం పెరుగుతాయని పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం 1 నుంచి 9 వరకు మూలసంఖ్యలు ఉన్నవారు ఏ వస్తువులను మీ పర్సులో ఉంచుకుంటే సిరిసంపదలు వచ్చిచేరుతాయో తెలుసుకుందాం..

మూలసంఖ్య- 1
నెల ఏదైనా సరే మీరు 1, 10, 19, 28 తేదీల్లో పుట్టి ఉంటే మీ మూల సంఖ్య 1గా భావించాలి. ఒకటికి అధిపతి సూర్యుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు తమ పర్సులో వెండి నాణెం, లేదా రాగి బిళ్ల ఉంచుకుంటే అదృష్టం వరిస్తుంది. అంతేకాకుండా మీకు ఆదాయానికి మార్గాలు పెరుగుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారని సంఖ్యా శాస్త్రం సూచిస్తోంది.
మూల సంఖ్య- 2
మీరు 2, 11, 20, 29 తేదీల్లో పుట్టి ఉంటే వారి మూల సంఖ్య 2.. అధిపతి చంద్రుడు. మీరు పర్సులో లేదా మీరు పనిచేసే డెస్క్ వద్ద స్వచ్ఛమైన ముత్యం, తెల్లటి స్ఫటికం పెట్టుకుంటే సంపద పెరుగుతుంది. సంపాదన మార్గాలు ఏర్పడతాయి.

మూలసంఖ్య- 3
3, 12, 21, 30 తేదీల్లో జన్మించినట్లయితే వారి మూల సంఖ్య 3, ఈ నంబర్‌కి అధిపతి గురుడు. పసుపు కలిపిన బియ్యం గింజలను పర్సులో ఉంచుకుంటే మీకు ఆర్థికంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. సంపద మార్గాలు పెరుగుతాయి.
మూలసంఖ్య- 4
మూల సంఖ్య 4కి అధిపతి రాహువు. నెలలో 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వారు పర్సులో చిన్న స్క్వేర్ షేప్ వెండి రేకును పెట్టుకోవడం ద్వారా అదృష్టం పెరుగుతుంది. ఆదాయం పెంచుకోవడానికి మార్గాలు పెరుగుతాయి.

మూల సంఖ్య- 5
నెల ఏదైనా సరే మీరు 5, 14, 23 తేదీల్లో పుట్టినట్లయితే వారి మూల సంఖ్య 5, బుధుడు అధిపతి. పర్సులో లేదా పనిచేసే చోట లక్ష్మీదేవికి ప్రతీక అయిన చిన్న శంఖాన్ని పెట్టుకుంటే సత్ఫలితాలు పొందవచ్చు. డబ్బు, అదృష్టం మీ వద్దకు నడుచుకుంటూ వస్తుంది.
మూల సంఖ్య- 6
నెలలో 6, 15, 24 తేదీల్లో జన్మిస్తే వారికి శుక్రుడు అధిపతి. చిన్న శ్రీ యంత్రాన్ని పర్సులో పెట్టుకుంటే వారిలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా మీ సంపద పెరుగుతుంది. సుఖసంతోషాలతో ఉంటారు.
మూల సంఖ్య- 7
7, 16, 25 తేదీల్లో జన్మించిన వారి మూల సంఖ్య- 7. కేతువు అధిపతి కాగా.. వీరు పర్సులో గోమతి చక్రాన్ని పెట్టుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం, శ్రేయస్సు సిద్ధిస్తుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.
మూల సంఖ్య- 8
8 మూల సంఖ్యకి అధిపతి శని. 8, 17, 26 తేదీల్లో పుట్టినవారు పర్సులో తామర గింజలను పెట్టుకుంటే ఆర్థికవృద్ధికి అనుకూలమైన శక్తి లభిస్తుంది.
మూల సంఖ్య- 9
కుజుడు అధిపతిగా ఉన్న మూల సంఖ్య 9. 9, 18, 27 తేదీల్లో జన్మించినవారు పర్సులో ఎరుపురంగు క్లాత్, రాగి నాణెం పెట్టుకుంటే మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుందని సంఖ్యాశాస్త్రం వెల్లడిస్తోంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో ప్రస్తావించబడిన రత్నాల ప్రయోజనాలు సాంప్రదాయ నమ్మకాలు, జ్యోతిషశాస్త్ర పద్ధతులపై ఆధారపడి ఉంటాయి. ఫలితాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు. జ్యోతిషశాస్త్ర ప్రయోజనాల కోసం ఏదైనా రత్నాన్ని ధరించే ముందు ధృవీకరించబడిన జ్యోతిష్కుడు లేదా రత్న నిపుణుడిని సంప్రదించండి. ఈ కంటెంట్ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది.



Click it and Unblock the Notifications
