Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
మీ మూడ్ ని తక్షణమే రిఫ్రెష్ చేసే కుంకుమపువ్వు ఐస్డ్ టీ..5 నిమిషాల్లో చేసుకోండిలా..
రోజూ అల్లం టీ, మసాలా ఛాయ్ తాగి మీకు కాస్త బోర్ కొట్టిందా? కొత్తగా, చల్లగా, మిమ్మల్ని తక్షణమే ఉల్లాసపరిచే డ్రింక్ ని ప్రయత్నించాలనుకుంటే..కుంకుమపువ్వు ఐస్డ్ టీ బెస్ట్ ఆప్షన్. సాధారణంగా మనం ఖరీదైన కేఫ్ లకు వెళ్ళినప్పుడు ఇలాంటి ఫ్యాన్సీ డ్రింక్స్ చూసి ఆకర్షితులవుతాం. కానీ అదే కేఫ్ తరహా అనుభూతిని, రాజీలేని రుచిని కేవలం కొన్ని నిమిషాల్లో మన ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కుంకుమపువ్వు సువాసన, యాలకుల ఘుమఘుమలు, చల్లటి బ్లాక్ టీ రిఫ్రెషింగ్ రుచి.. ఇవన్నీ కలిస్తే వచ్చే ఆ మధురానుభూతి మాటల్లో చెప్పలేనిది.

కుంకుమపువ్వు ఐస్డ్ టీ తయారీకి కావలసిన పదార్థాలు
నల్ల టీ ఆకులు (బ్లాక్ టీ పౌడర్ లేదా ఆకులు) - 2 టీస్పూన్లు
నీళ్లు - అర లీటరు
పచ్చ యాలకులు - 6 నుండి 8
కుంకుమపువ్వు - చిటికెడు
పంచదార - చిటికెడు
వేడి పాలు - కొద్దిగా
ఫ్రెష్ క్రీమ్ - 3 టీస్పూన్లు
కండెన్స్డ్ మిల్క్ - 1 టీస్పూన్
కుంకుమపువ్వు పాలు - 2 టీస్పూన్లు
ఐస్ క్యూబ్స్ - తగినన్ని
వర్షాకాలంలో తాగాల్సిన టీ ఇదే..అసలైన ఆరోగ్యం ఇందులోనే
కుంకుమపువ్వు ఐస్డ్ టీ తయారీ విధానం
-ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో అర లీటరు నీరు పోసి బాగా మరిగించండి. నీరు మరుగుతున్నప్పుడు, స్టవ్ ఆపేయండి. ఇప్పుడు అందులో 2 టీస్పూన్ల బ్లాక్ టీ ఆకులను, ముందుగా కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చ యాలకులను వేయండి. మరుగుతున్న నీటిలో కాకుండా, స్టవ్ ఆపిన తర్వాతే టీ ఆకులు వేయడం వల్ల టీ చేదుగా మారదు. దాని అసలైన సువాసన, రుచి అద్భుతంగా వస్తుంది. దీనిపై మూత పెట్టి సరిగ్గా 5 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత ఒక వడపోత సహాయంతో టీని వడకట్టి, పూర్తిగా చల్లారనివ్వండి.
-చల్లారిన ఈ టీని ఫ్రిజ్‌లో ఉంచండి. ఒక్కో గ్లాసు ఐస్డ్ టీకి సుమారు 100 ml ఈ డికాక్షన్ సరిపోతుంది.
-ఇప్పుడు ఒక చిన్న రోలు తీసుకుని, అందులో కొన్ని కుంకుమపువ్వు రేకులు, చిటికెడు చక్కెర వేసి మెత్తగా నూరండి. చక్కెర వేయడం వల్ల కుంకుమపువ్వు త్వరగా మెత్తబడి, తన రంగును సులభంగా వదులుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా వేడి పాలలో వేసి కలపండి. పాలు అద్భుతమైన బంగారు రంగులోకి మారుతాయి. ఈ పాలను పూర్తిగా చల్లారనివ్వండి.
బజ్జీలు, పకోడీలు వద్దు.. వర్షాకాలంలో రాగి సూప్ ఇలా చేసి తాగితే బోలెడు బెనిఫిట్స్
-ఒక బౌల్ తీసుకుని, అందులో 3 టీస్పూన్ల ఫ్రెష్ క్రీమ్, 1 టీస్పూన్ కండెన్స్డ్ మిల్క్, ముందుగా సిద్ధం చేసుకున్న కుంకుమపువ్వు పాలను 2 టీస్పూన్లు వేయండి. ఒక విస్కర్ సహాయంతో దీన్ని బాగా గిలకొట్టండి. ఇది చిక్కగా, చాలా మృదువుగా మారాలి.
-ఇప్పుడు ఒక పొడవాటి గ్లాసు తీసుకోండి. అందులో నిండుగా ఐస్ క్యూబ్స్ వేయండి. ఇప్పుడు ఫ్రిజ్ లో ఉంచిన చల్లటి బ్లాక్ టీని ఐస్ మీదగా పోయండి. చివరగా, గ్లాసు పైన మనం తయారు చేసి పెట్టుకున్న క్రీమీ కుంకుమపువ్వు నురగను నెమ్మదిగా పోయండి.
-అంతే ఎంతో రుచికరమైన, ఉల్లాసాన్నిచ్చే కుంకుమపువ్వు ఐస్డ్ టీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
