Latest Updates
-
నార్త్ కర్ణాటక స్టైల్ కొబ్బరి చట్నీ.. బోండా,గారె, ఇడ్లీ, దోసెలతో తింటుంటే ఆ మజానే వేరే లెవల్! -
పిచ్చిమొక్క అనుకోకండి.. ప్రయోజనాలు తెలిస్తే పిచ్చెక్కిపోతారు! -
సెప్టెంబర్ లో ఈ 6 రాశులపై లక్ష్మీదేవి కృప..ఊహించని ధనలాభం, అద్భుత విజయాలు -
నోరూరించే సగ్గుబియ్యం పాప్స్..ఉపవాసాల సమయంలో ఎనర్జీ ఇచ్చే బెస్ట్ స్నాక్ -
ఆరోగ్యానికి అమృతం..గ్యాస్, ఉబ్బరం మాయం చేసే కొండ ప్రాంతపు పచ్చ ఉప్పు..వేడి అన్నంతో స్వర్గమే! -
టీలో చక్కెరకి బదులు బెల్లం లేదా తేనె వేస్తున్నారా? క్యాన్సర్ సర్జన్ చెబుతున్న ఈ నిజం తెలుసుకోండి -
ఇడ్లీ, దోసె, పూరీ.. దేనిలోకైనా అదిరిపోయే కుంభకోణం కడప్ప.. టేస్ట్ చేస్తే వదిలిపెట్టరు! -
రోడ్డుపై డబ్బు దొరికితే వెంటనే ఖర్చు చేస్తున్నారా.. ఆగండాగండి, జ్యోతిష్యం చెబుతున్న వాస్తవాలివే.! -
శరీరానికి అవసరమైన పోషకాల కోసం.. రుచికరమైన గ్రీన్ పొంగల్ ఎలా చేసుకోవాలంటే.. -
వాస్తు ప్రకారం ఇల్లు తుడుచుకోవడానికి సరైన టైం ఏది?
ఐస్ క్రీమ్స్ కంటే చల్లగా.. కూల్ డ్రింక్స్ కంటే హెల్తీగా..ఈ సమ్మర్ కు జొన్న గంజి బెస్ట్!
ప్రస్తుతం ఎండాకాలం వచ్చేసింది. ఉదయం పది గంటలు దాటితే చాలు సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ భగభగ మండిపోతున్నాడు. ఈ ఉక్కిరిబిక్కిరి చేసే ఉక్కపోతకు, మండుతున్న ఎండల వేడికి శరీరంలో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగిపోతాయి. వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి మనం కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ వైపు పరుగులు తీస్తుంటాం. కానీ అవి ఆరోగ్యానికి అంత మంచివి కావు.
ఈ వేసవిలో మన శరీరాన్ని చల్లబరిచి, ఆరోగ్యంగా ఉంచే సహజమైన పానీయం ఏదైనా ఉందా? అంటే.. కచ్చితంగా జొన్న గంజి అని చెప్పవచ్చు. జొన్న గంజి తాగితే శరీరంలో ఉన్న వేడి మొత్తం ఇట్టే మాయమవుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. మరి ఇంతటి అద్భుతమైన, రుచికరమైన జొన్న గంజిని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

జొన్న గంజి తయారీకి కావలసిన పదార్థాలు
జొన్న రవ్వ లేదా జొన్న పిండి - అర కప్పు
నీరు - మూడు కప్పులు
మజ్జిగ- ఒక కప్పు
ఉప్పు - రుచికి తగినంత
ఉల్లిపాయలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
కొత్తిమీర - కొద్దిగా
జొన్న గంజి తయారీ విధానం
-ముందుగా అర కప్పు జొన్న రవ్వను (లేదా పిండిని) తీసుకుని, ఒకసారి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఒక మందపాటి గిన్నె లేదా పాత్రను పెట్టుకుని అందులో మూడు కప్పుల నీళ్లు పోయాలి. నీటిని బాగా మరిగించాలి.
-నీళ్లు బాగా మరుగుతున్న సమయంలో మంటను మీడియంకి అడ్జస్ట్ చేయండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న జొన్న రవ్వను వేడి నీళ్లలో నెమ్మదిగా పోస్తూ, మరో చేత్తో గరిటె పట్టుకుని తిప్పుతూ ఉండాలి. జొన్న రవ్వ త్వరగా ఉండలు కడుతుంది కాబట్టి, ఎక్కడా ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుతూ మీడియం మంట పైనే ఉడికించాలి.
-రవ్వ బాగా ఉడికి, పల్చటి గంజి లాగా తయారయ్యే వరకు చూసుకోవాలి. ఇది మరీ చిక్కగా పేస్ట్ లాగా కాకుండా, కొంచెం పల్చగా ఉండేలా చూసుకోండి.
-గంజి బాగా ఉడికిన తర్వాత అందులో మీ రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి బాగా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, గిన్నెను కిందకు దించి గంజిని పూర్తిగా చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడు మజ్జిగ కలిపితే విరిగిపోతుంది, కాబట్టి పూర్తిగా చల్లారడం చాలా ముఖ్యం.
-గంజి పూర్తిగా చల్లారిన తర్వాత, అందులో ముందుగా సిద్ధం చేసుకున్న ఒక కప్పు మజ్జిగను పోసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము వేసి అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. కావాలంటే ఇందులో కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి వేసుకుంటే రుచి మరింత అద్భుతంగా ఉంటుంది.
-అంతే ఎంతో రుచికరమైన, చల్లచల్లని జొన్న గంజి తాగడానికి రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications