Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
అటుకుల లడ్డు-కృష్ణాష్టమి స్పెషల్
అటుకుల లడ్డు-కృష్ణాష్టమి స్పెషల్

ఆ ప్రసాదాలలో తప్పనిసరిగా అటుకులతో చేసి వెరైటీలే కనబడుతాయి. అటుకులంటే అంత ఇష్టం కృష్ణునికి. కుచేలుడి సంగతి కృష్ణునికి తెలియదా...?కాని - అటుకులు పట్టుకొస్తే తప్ప కరుణించలేదు..! గోప వనితలు ఎంత ఆరాధిస్తే ఏం?పాల కడవలో, వెన్న కుండలో సమర్పించాల్సిందే కదా!తల్లి యశోద కొసరి కొసరి ఎన్ని తినిపించిందో కాని, ఆ నల్లగోపయ్య భక్తుల చిట్టి ప్రసాదం చూస్తే మురిసిపోతాడు. తన సాక్షాత్కారంతో మెరిసిపోతాడు. ఈ కృష్ణుడి పుట్టినరోజున..చిట్టి పాదాలతో నడిచి వచ్చే ఆ స్వామికి ఇష్టమైన అటుకులతో ఈ తీపి వంటకం సమర్పిద్దాం...
అటుకులు: 1cup
బెల్లం తురుము: 1/2cup
కొబ్బరి తురుము: 1/2cup
నెయ్యి: 2tbsp
జీడిపప్పు: 6
కిస్ మిస్: 10
యాలకులపొడి: 1tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ వెలిగించి మందపాటి పాన్ స్టౌ మీద పెట్టి అటుకులు వేసి లేత బంగారువర్ణంలోకి మారేవరకూ వేయించాలి. తర్వాత క్రింది దింపుకొని చల్లారనివ్వాలి.
2. తర్వాత వేయించిన అటుకులను, కొబ్బరి తురుము, యాలకులు, జీడిపప్పును మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో బెల్లం తురుము కూడా వేసి మెత్తగా అయ్యేంత వరకూ గ్రైడ్ చేసుకోవాలి.
4. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోని తీసుకొని నెయ్యి, కిస్ మిస్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా చేతిలోనికి తీసుకొని లడ్డులా వత్తుకోవాలి. అంతే కృష్ణాష్టమి స్పెషల్ అటుకు లడ్డు రెడీ...



Click it and Unblock the Notifications