Latest Updates
-
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
వేసవిలో హై బీపీ, లో బీపీ.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు లైట్ తీసుకోవద్దు! -
అర్ధరాత్రి తిరుమలలో బెల్లంకొండ శ్రీనివాస్ పెళ్లి.. ఎవరికీ తెలియకుండా ఆ ముహూర్తం ఎందుకు? -
డిన్నర్ తర్వాత తీయగా ఏదైనా తినాలనిపిస్తోందా? మ్యాంగో రసమలై బెస్ట్ ఛాయిస్.ఎలా చేసుకోవాలంటే.. -
కాశీ వీధుల్లో దొరికే ఫేమస్ లస్సీ.. నోటికి రుచి, ఒంటికి శక్తి..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
సిద్ధి యోగంతో నేడు ఈ రాశుల వారికి తిరుగులేదు.. ఆటంకాలన్నీ మాయం! -
ఈ మొక్క ఆకులు ఉంటే..వంటగదిలో బొద్దింకలు, వార్డ్ రోబ్ లోని పురుగులు పరార్! -
రైలులో ఐఏఎస్ సంబంధం… ఇది పెళ్లా లేక బిజినెస్ డీలా? నెటిజన్లు ఎందుకు మండిపడుతున్నారు? -
తులా రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. నరసింహ జయంతి వేళ ఈ రాశుల వారికి అదృష్టం!
బాదం ఫిర్ని రిసిపి: రంజాన్ స్పెషల్
పాలు, బాదం మరియు బాస్మతి బియ్యంతో తయారు చేసే రోజ్ ఫిర్నీ నార్త్ ఇండియన్ డిజర్ట్ . ఇండియన్ వంటకాల్లో ఇది ఒక వెరైటీ రైస్ పుడ్డిం, అంటే ఖీర్, పాయసం, వంటిదమాట. అయితే ఫిర్ని కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ బియ్యాన్ని నానబెట్టి, పేస్ట్ చేసి పాలతో ఉడికిస్తారు. ఇది ముగలైయ్ కుషన్. ఇది ట్రెడిషనల్ రిసిపి, చూడటానికి నోరూరిస్తూ..కలర్ ఫుల్ గా ఉంటుంది. దీన్ని పిస్తా..బాదాంతో గార్నిష్ చేస్తే మరింత టేస్ట్...మరి ఈ వెరైటీ డిజర్ట్ ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దామా..

కావల్సిన పదార్థాలు:
బెల్లం: 4tbsp(పొడి చేసుకోవాలి)
బాదం: 10-15(పొడి చేసుకోవాలి)
పాలు: 3cups
బియ్యం: 1/4cup(నీళ్ళలో నానబెట్టుకోవాలి)
యాలకుల పొడి: 1/2tsp
రోజ్ వాటర్: 1tsp
తయారుచేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా పాలు పోసి కాగనివ్వాలి.
2. తర్వాత బియ్యంనానబెట్టిన నీళ్ళను వంపేసి, తడి బియ్యంను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఈ బియ్యం పిండి పేస్ట్ కు కొద్దిగా మరిగించిన పాలను పోసి, బాగా మిక్స్ చేయాలి.
4. ఇప్పడు ఈ బియ్యపిండి పాల మిశ్రమాన్ని స్టౌ మీద పెట్టి తిరిగా బాయిల్ చేయాలి.
5. మీడియం మంట మీద చిక్కబడే వరకూ ఉడికించుకోవాలి.
6. ఉడుకుతున్నప్పుడే అందులో యాలకుల పొడి మరియు బెల్లం తురుము కూడా వేసి బాగా మిక్స్ చేయాలి.
7. తక్కువ మంట మీద 5-6నిముషాలు ఉడికించుకోవాలి.
8. చివరగా బాదంను మిక్స్ చేయాలి. మొత్తం మిశ్రం రెడీ అయిన తర్వాత చల్లారనివ్వాలి.
9. చల్లారిని తర్వాత ఫ్రిజ్ లో పెట్టి, అరగంట తర్వాత బయటకు తీసి చల్లచల్లగా అందివ్వాలి.



Click it and Unblock the Notifications