Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
చలికి వెరైటీ టేస్ట్ : బేక్డ్ ఎగ్స్...
గుడ్లుతో ఎన్ని వెరైటీలు చేసుకోవచ్చో. ఎన్ని వైరైటీలు చేసుకొన్నా ఒక్కొక్కో వెరైటీకి ఒక్కో రుచి ఉంటుంది. ఈ వర్షాకాలంలో బేక్డ్ ఎగ్ రుచి అమోఘంగా ఉంటుంది. ఉడికించిన ఎగ్స్ తో తయారు చేసుకొనే బేక్డ్ ఎగ్స్ చేయడం చాలా సలభం. కొద్దిగా సమయం దొరికినప్పుడు ఇటువంటి వెరైటీలను తయారు చేసి రుచి చూడం. ఆ వత్యాసాన్ని ఆస్వాదించండి. బేక్డ్ ఎగ్స్ ఇంత రుచిగా ఉండాటాని అందులో ఉపయోగించే స్పైసీ ఐటమ్సే కారణం. గుడ్డును చికెన్ లేదా పనీర్ తో కూడా స్టఫ్ చేసుకోవచ్చు. దీనికి వెన్న, జున్ను పెప్పర్ పడటం వల్ల రుచికరంగా సువాసనగా చూడగానే తినేయాలనిపించే విధంగా పిల్లలను పెద్దలను ఆకర్షిస్తుంది. మరి మీరూ ట్రై చేసి చూడండి.....

కావలసిన పదార్థాలు
గుడ్లను వేడిచేయడం కోసం
గుడ్లు: 4
వెన్న: 2cups
జున్ను: 2-3tbsp
ఫిల్లింగ్ (గుడ్డులో నింపడం)కోసం
ఉల్లిపాయలు: 2-3(చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
చికెన్: 500grms(ఖీమా)
వెనిగర్: 2tbsp
బ్లాక్ పెప్పర్(మిరియాలు): 1/2tbsp
కొత్తిమీర తరుగు: 1cup
టమోటో: 1-2(చిన్నగా కట్ చేసినవి)
జున్ను: 2-3tbsp
ఉప్పు: రుచికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందగా ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు, చిటికెడు ఉప్పు వేసి గుడ్లను అందులో వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించి, క్రిందికి దింపుకొని చల్లారిన తర్వాత గుడ్డును పై పొట్టు తొలగించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ తీసుకొని అందులో కొద్దిగా జున్ను వేయాలి.
3. తర్వాత జున్న కరిగాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ తక్కువ మంట మీద వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందలోనే చికెన్ ఖీమా ను, వెనిగర్, పెప్పర్ పౌడర్, కొత్తిమీర తరుగు ఒకదానికి తర్వాత ఒకటి వేసి కొద్దిగా ఉప్పు చేర్చి ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఖీమా మొత్తబడేవరకూ తక్కువ మంట మీద వేపుతూ ఉండాలి. మెత్తగా వేగిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత ఉడికించి పెట్టుకొన్న గుడ్లను తీసుకొని ఒక్కో గుడ్డును రెండు బాగాలుగా కత్తితో కట్ చేసి లోపల ఉండే పచ్చసొన బయటకు తీసేసుకోవాలి. పచ్చసొన ఉన్న ప్రదేశంలో ఇప్పుడు చికెన్ ఖీమా మిశ్రమాన్ని స్టఫ్(నింపాలి) చేయాలి.
6. ఇప్పుడు బేకింగ్ పాన్ తీసుకొని వేడి చేసి అందులో వెన్న వేసి వేడి చేయాలి. తర్వాత వేడిగా కరిగిన వెన్న మీద స్టఫ్డ్ ఎగ్ ను ఉంచాలి. వేయించుకోవాలి. గుడ్డులో చదిరిపోకుండా ఉండాలంటే మైక్రో ఓవెన్ లో బేక్ చేసుకోవడం మంచిది. మైక్రోఓవెన్ లో బేక్ చేయాల్సి వస్తే వేడి 200డిగ్రీ లో 15 నిమిషాల పాటు బేక్ చేస్తే సరిపోతుంది.



Click it and Unblock the Notifications