కొబ్బరి ఒబ్బట్టు

Coconut Obbattu
కావలసిన పదార్ధాలు:

పచ్చి కొబ్బరి తురుము - 250 grm
బెల్లం - 250 grm
మైదాపిండి - 250 grm
గసగసాలు - 50grm
నూనె - అర కప్పు
నెయ్యి - అరకప్పు
యాలకులపొడి - 1 tsp

తయారు చేయు విధానము:

1. కొబ్బరితురుము, పొడి చేసుకున్న బెల్లం కలిపి కొంచెం నీళ్ళు పోసి బాగా ఉడకనీయాలి. మొత్తం ఉడికి గట్టిపడ్డాక యాలకులపొడి రెండు స్పూనుల నెయ్యి వేసి కలిపి చిన చిన్నవుండలు చేసుకోవాలి.
2. మైదాపిండిలో కొంచెం నూనె నీళ్ళు పోసి పూరి పిండిలా కలిపిరెండుగంటలు నాననివ్వాలి.
3. తరువాత ఈ పిండిని చిన్న ముద్దలుగా చేసుకుని నూనె చేతితో వెడల్పు చేసుకుని మధ్యలో పూర్ణం వుండ పెట్టి అంచులు మడిచి ఒబ్బట్టులా వత్తుకుని వేడెక్కిన పెనంపై వేసి నేయ్యి వేస్తు రెండువైపులా ఎర్రగా కాల్చాలి అంతే కొబ్బరి ఒబ్బట్టు రెడీ.

Story first published: Friday, December 11, 2009, 16:07 [IST]
Desktop Bottom Promotion