For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కూల్ సమ్మర్ పపాయ(బొప్పాయి) జ్యూస్

|

Cool Summer Papaya(Boppay)Juice Recipe
చర్మానికి అందంతో పాటు ఆరోగ్యానికి పండ్లు చాలా ఉపయోగపడుతాయి. ప్రతి నిత్యం మనం మార్కెట్‌లో ఏదో ఒక రకం పండ్లు కొంటాం. ఆ పండ్ల తోలు, గుజ్జు మనకు ఎంతో ఆరోగ్యం కలుగ చేస్తుంది. పండ్లలో విటమిన్లు, మినరల్స్‌ కార్బోహైడ్రేట్స్‌, పీచు పదార్ధములతో బాటు- 'ఆంటి ఆక్సిడన్స్‌' అనేది అధికంగా వుండడం వల్ల - చర్మ సౌందర్యాన్ని కాపాడి చర్మ వ్యాధులను నివారిస్తుంది. బొప్పాయి: చర్మ సౌందర్యాన్ని కాపాడే పండ్లలో బొప్పాయి ఒకటి. దీనిలో ఎ.ఇ.సి. విటమిన్లు వున్నం దున చర్మాన్ని కాపాడడంతోబాటు మృదుత్వాన్ని రక్షిస్తుంది. దీనితో తయారు చేసిన నూనె, చర్మానికి శుభ్రంగా ఉంచుతుంది. బొప్పాయి జ్యూస్‌ సూర్యరశ్మి వల్ల వచ్చే మచ్చలను నివారించడమే కాకుండా శరీరానికి రక్షణనిస్తుంది. పంచదార కలుపకుండా చేసే బొప్పాయి జ్యూస్‌ను చక్కెర వ్యాధితో బాధపడేవారికి కూడా ఇవ్వవచ్చు.

కావలసిన పదార్థాలు :
బొప్పాయి పండు: 1
పంచదార: 1cup
తేనె: 1tsp
పెప్పర్ పౌడర్: చిటికెడు
యాలకుల పొడి: 1tsp
పుదీనా ఆకులు: కొద్దిగా
ఐస్ క్యూబ్స్: తగినన్ని
తయారు చేయు విధానం :
1. బొప్పాయిపండును శుభ్రంగా కడిగి పై చెక్కును తీయాలి. చిన్న చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి గుజ్జు తయారు చేయాలి.
2. రెండు గ్లాసుల పంచదార, పెప్పర్ పౌడర్, యాలకుల పొడి, పుదీనా ఆకుల ముక్కలను గుజ్జులో కలుపుకోవాలి.
3. తర్వాత పంచదార పూర్తిగా కరిగేలా కలియదిప్పి గ్లాసుల్లో పోసి పైన తేనె, ఐస్‌ క్యూబ్స్ వేసి సర్వ్ చేయాలి.

English summary

Cool Summer Papaya(Boppay)Juice Recipe | కూల్ సమ్మర్ పపాయ(బొప్పాయి) జ్యూస్

There are many health benefits of papaya juice. Drinking papaya juice helps you to fight against innumerable health problems. Papaya juice is full of nutrients which are essential for maintaining good health.
Story first published:Monday, March 12, 2012, 14:37 [IST]
Desktop Bottom Promotion