Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
కోవా -క్యారెట్ హల్వా: స్పెషల్ స్వీట్ డిష్
ప్రస్తుతం మార్కెట్లో ఎక్కడ చూసినా క్యారెట్లు కనబడుతున్నాయి. అంటే ఇది క్యారెట్ల సీజన్ అన్నమాట. అయితే సందేహం లేకుండా వీటిని మీ రెగ్యులర్ హెల్తీ డైట్ లో చేర్చుకోవాల్సిందే. అది సలాడ్, సైడ్ డిష్ లేదా డిజర్ట్ రూపంలో తీసుకోవల్సిన హెల్తీ వెజిటేబుల్ క్యారెట్. దీన్ని ఖచ్చితంగా మీ డైట్ లో చేర్చుకోవాల్సిందే. క్యారెట్ ఉపయోగించి డిజర్ట్ తయారుచేయాలంటే వెంటనే మన మనస్సులు క్యారెట్ హాల్వానే గుర్తుకు వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ ఇష్టపడే ఒక ఫేవరెట్ సౌత్ ఇండియన్ స్వీట్ డిష్.
క్యారెట్ స్వీట్ హల్వా తయారుచేయడానికి కొంత సమయం తీసుకుంటుంది, కానీ ఈ స్వీట్ డిష్ యొక్క ఫ్లేవర్ మరియు టేస్ట్ ను బట్టి మీరు ఓపికగా తయారుచేసుకుంటారు. క్యారెట్ హల్వాను రెండు పద్దతుల్లో తయారుచేస్తారు. ఒకటి పాలను ఉపయోగించి తయారుచేస్తే, రెండవది కోవాను ఉపయోగించి తయారుచేసుకుంటారు . కోవా పాలతో తయారుచేసేటటువంటి ఒక చిక్కటి పదార్థం. దీన్ని అనేక ఇండియన్ స్వీట్ డిష్ గులాబ్ జామూన్ క్యారెట్ హల్వాలలో ఉపయోగిస్తుంటారు. మీకు క్యారెట్ హాల్వా ఇష్టమైతే మరియు ఈ స్వీట్ డిష్ ను తయారుచేసుకోవాలనుకుంటే, ఎలా తయారుచేయాలో ఈ క్రింది విధంగా తెలుసుకోవాల్సిందే...

క్యారెట్లు: 1 kg (తురుము కోవాలి)
పాలు: 2ltr
ఖోవా: 150gms
పంచదార: 1cup
నెయ్యి: 2tbsp
గార్నిషింగ్ కోసం
జీడిపప్పు: 5- 6 (రెండుగా చేసుకోవాలి)
బాదం: 5- 6(సన్న ముక్కలుగా చేయాలి)
ఏలకుల పొడి : 1చిటికెడు
తయారుచేయు విధానం:
1. ముందుగా డీప్ బాటమ్ పాన్ లో పాలు పోసి బాగా మరింగించాలి.
2. మద్యమద్యలో స్పూన్ తో కలియబెడుతుండాలి. లేదంటే ప్రాత అడుగున అంటుకొంటుంది. కాబట్టి మద్యమద్యలో కలియబెడుతూ 45-50నిముషాలు బాగా మరగకాచాలి.
3. పాలు చిక్కగా మరియు క్రీమీగా మారుతున్న సమయంలో అందులో క్యారెట్ తురుమును వేసి క్యారెట్ ను బాగా మెత్తగా ఉడికించుకోవాలి. అలాగే పాలు క్యారెట్ బాగా పాలు బాగా ఇమిరిపోయేలా ఉడికించాలి.
4. క్యారెట్ బాగా మెత్తబడుతూ పాలు పూర్తిగా ఇమిరిపోయే వరకూ ఉడికించాలంటే కనీసం 45నిముషాల సమయం పడుతుంది.
5. పాలు మొత్తం క్యారెట్ తో ఇంకిపోయిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
6. ఇప్పుడు మరో డీప్ పాన్ లో నెయ్యి వేసి, వేడి చేసి అందులో పాలలో ఉడికించుకొన్న క్యారెట్ మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా నెయ్యిలో మిక్స్ చేస్తూ, అలాగే కోవా, పంచదార వేస్తూ.. మిక్స్ చేస్తూ తక్కువ మంట మీద మరో 10-15నిముషాలు ఉడికించుకోవాలి.
7. పంచదార పూర్తిగా క్యారెట్ మిశ్రమంలో కలిసిపోయి, కరిగిపోయే వరకూ సన్నని స్పూన్ తో అలాగే కలుపుతుండాలి. ఇలా పూర్తిగా చేసిన తర్వాత స్టౌ ఆఫ్ చేసేయాలి.
8. అంతే కోవా క్యారెట్ హాల్వా రెడీ. చివరగా కట్ చేసి పెట్టుకొన్ని నట్స్ తో గార్నిష్ చేసి వేడి లేదా చల్లగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications