Latest Updates
-
మైదా పడదు, టేస్ట్ తగ్గదు.. ఇంట్లోనే ఈజీగా హై ప్రొటీన్ పనీర్ మఖానీ పిజ్జా ఎలా చేసుకోవాలంటే.. -
తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది: భారీ వర్షాలు, ఈదురు గాలుల నుంచి ఇలా రక్షించుకోండి! -
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు! -
నేటి రవి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
రోజూ తినే దోసెలు బోర్ కొట్టాయా? అయితే ఈ సమ్మర్ స్పెషల్ దోసె ట్రై చేయండి -
తిరుపతి గంగమ్మ జాతరలో 'బండ వేషం' ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం, భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన నియమాలు ఇవే! -
మే 11న కుజుడి సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని విజయం.. మీ రాశికి ఏం జరగబోతోంది? -
ధనుస్సు, సింహం, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 07 మే 2026 -
రేప్ కేసులు, మర్డర్ కేసులు..బెంగాల్ అసెంబ్లీలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు..చట్టసభకు 190 మంది నేరచరితులు!
డేట్స్ , బాదం & హనీ బాల్స్-స్వీట్ అండ్ హెల్తీ
బాదం, ఖర్జూరం, తేనె ఒక అద్భుతమైన ట్రీట్ అనిచెప్పవచ్చు. ఎందుకంటే ఇది నోటికి రుచిని మాత్రమేకాదు, మన ఆరోగ్యానికి సంపూర్థ లాభాలను కూడా చేర్చుతుంది. ఈ బాదం, ఖర్జూరం, తేనెతో తయారుచేసే ఈ స్పెషల్ స్వీట్ బాల్స్ ఒక బలవర్థకరమైన ఆహారం. పిల్లలకు, పెద్దలకు ఒక మంచి పౌష్టికాహారం అని చెప్పవచ్చు. తక్షణ శక్తిని అంధించే ఒక మంచి ఈవెనింగ్ స్నాక్ గా కూడా పిలవచ్చు.
చాలా సింపుల్ గా, చిటికెలో తయారుచేసే స్నాక్ ఐటమ్స్ లో ఇది ఒకటి. అంతే కాదు, ఏ సమయంలోనైనా నిరభ్యతంరంగా తినవచ్చు. లంచ్ బాక్స్ లో కూడా సర్వ్ చేసి సర్ ప్రైజ్ చేయవచ్చు. ఇంటికి అథితులు వస్తే. ఒక కొత్త రుచిని అంధించవచ్చు. మరీ ఈ గ్రేట్ హెల్తీ స్నాక్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:
ఖర్జూరాలు: 1cup
బాదం: 1/2cup
నువ్వులు: 1/2cup(వేయించినవి)
ఎండుకొబ్బరి తురుము : 1/2cup
కొబ్బరి పొడి : 1/2cup
తేనె : మిశ్రమాన్ని బాల్స్ చేయడానికి తగినంత
తయారు చేయు విధానం:
1. ముందుగా బాదం పప్పును, కొబ్బరి తురుము, నువ్వులను కలిపి మిక్సీలో వేసి బరకగా గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి(పొడి కాకూడదు, పలుకుగా ఉండాలి).
2. తర్వాత అందులో ఎండు ఖర్జూరంలోని గింజలు తీసివేపి ఖర్జూరం తొనలు వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమాన్నిగిన్నెలోకి తీసుకుని అందులో తేనె కలిపి లడ్డూలుగా చేయాలి.
4. తర్వాత ఈ లడ్డూలను కొబ్బరి పొడిలో అద్దాలి. లడ్డూకు అన్నివైపులా కొబ్బరి పొడి పట్టేటట్లు చూడాలి. ఇది చాలా బలవర్ధకమైన ఆహారం.
అంతే డేట్స్, బాదం, హనీ లడ్డు రెడీ.



Click it and Unblock the Notifications