Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ క్యాప్సికమ్ ఎగ్ చిల్లీ... ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
మదర్స్ డే రోజున అత్తాకోడళ్ల మధ్య గొడవలు… అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు! -
మీ కళ్ళు అలా అవుతున్నాయా? అయితే మీ లివర్ డేంజర్ లో ఉన్నట్టే! -
ఐరన్, ప్రోటీన్ల గని..అందాన్ని, ఆరోగ్యాన్ని రెట్టింపు చేసే అలివ్ లడ్డూ'..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణీలు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే! -
మామిడిపండు ఉదయం తినాలా? మధ్యాహ్నాం తినాలా? రాత్రి తినాలా?..నిపుణులు ఏమంటున్నారంటే.. -
అదృష్టం తలుపు తడుతోంది.. ఈ రాశుల వారికి ఈరోజు ఊహించని ధనలాభం, కెరీర్లో సక్సెస్! -
ఎముకలకు బలాన్నిచ్చే కరకరలాడే రాగి వడియాలు..తయారీ విధానం ఇదే! -
మేషరాశిలోకి కుజుడు.. రుచక మహాపురుష రాజయోగంతో ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
హనుమాన్ జయంతికి వెళ్తున్నారా? ఆలయాల్లో రద్దీ, ట్రాఫిక్ ఆంక్షలు.. భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలివే!
కైమా పప్స్

కైమా: 1/2kg
ఉల్లిపాయలు: 1/2kg
పచ్చి మిర్చి: 5
అల్లం: చిన్నముక్క
వెల్లుల్లి రెబ్బలు: 4
అల్లం, వెల్లుల్లి పేస్ట్: 1tsp
కొత్తిమీర తరుగు:1tbsp
ధనియాల పొడి:1tbsp
పసుపు: 1/4tsp
గరం మసాల పొడి: 1/2tsp
కోడి గుడ్లు: 3 (ఉడికించుకుని సగానికి కోసి ఉంచాలి)
గోధుమ పిండి: 200grm
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: కావలసినంత
తయారు చేయు విధానం:
1. కైమాకు కారం, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, ఉప్పు చేర్చి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
2. గోధుమ, మైదా పిండికి కొద్దిగా ఉప్పు, నీళ్ళు చేర్చి చపాతీ పిండిలా కలిపి విడిగా పెట్టుకోవాలి.
3. పాన్ లో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో ఉల్లిపాయ పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, కొత్తిమీర, కరివేపాకును వేసి దోరగా వేయించాలి.
4. వీటన్నింటినీ ఉడికించిన కైమా ముద్దకు చేర్చి బాగా కలపాలి.
5. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న ఉండల్లా చేసుకొని, చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి.
6. ఇందులో ముందే తయారుచేసి పెట్టుకున్న కూరను మూడు టేబుల్ స్పూన్లను వేసి చపాతీ అంతా రాయాలి.
7. కోసి పెట్టుకున్న కోడిగుడ్డును మధ్యలో పెట్టాలి. ఇప్పుడు మరో చపాతీని ఇదే పరిమాణంలో ఒత్తి దీనిపై ఉంచి నాలుగు చివర్లు కలుపుతూ అతికించాలి.
8. కొద్దిగా నూనె రాస్తే సులువుగా అతుక్కుంటుంది. వీటిని నూనెలో వేసి మంచి రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే కైమా పప్స్ రెడీ. వీటిని పుదీనా, కొత్తిమీర చట్నీతో తింటే భలే రుచిగా ఉంటాయి.



Click it and Unblock the Notifications