Latest Updates
-
మే 7: ఈ రాశుల వారికి అదృష్టం తలుపు తడుతోంది..అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
బిర్యానీ లవర్స్ తస్మాత్ జాగ్రత్త..ఈ పొరపాట్లు చేస్తే ప్రాణాలకే ముప్పు! -
నేటి రవి యోగం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
రోజూ తినే దోసెలు బోర్ కొట్టాయా? అయితే ఈ సమ్మర్ స్పెషల్ దోసె ట్రై చేయండి -
తిరుపతి గంగమ్మ జాతరలో 'బండ వేషం' ఎందుకు వేస్తారు? దీని వెనుక ఉన్న అసలు రహస్యం, భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన నియమాలు ఇవే! -
మే 11న కుజుడి సంచారం: ఈ రాశుల వారికి తిరుగులేని విజయం.. మీ రాశికి ఏం జరగబోతోంది? -
ధనుస్సు, సింహం, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. మీ రాశి ఉందా? - గురువారం, 07 మే 2026 -
రేప్ కేసులు, మర్డర్ కేసులు..బెంగాల్ అసెంబ్లీలో మైండ్ బ్లాంక్ అయ్యే నిజాలు..చట్టసభకు 190 మంది నేరచరితులు! -
అన్నం,చపాతీ,బగారా రైస్ లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..రెస్టారెంట్ స్టైల్ పుదీనా చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బటర్ మష్రూమ్ మసాలా.. ఇలా చేస్తే రుచి అదుర్స్!
మ్యాంగో(మామిడి) కోవా

మామిడిపండ్లు: 2(బాగా పండినవి)
పాలు: 4cups
పంచదార: 1/2cup
నెయ్యి: 1tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బాగా పండిన మామిడి పండ్లను పొట్టుతీసి గుజ్జును వేరుచేసుకోవాలి. తర్వాత ఈ మామిడిపండు ముక్కలను ముక్కలుగా లేకుండా మెత్తని గుజ్జులా తయారు చేసుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్ లేదా పాన్ లేదా పాల కుక్కర్ లో పాలు పోసి, బాగా కాగనివ్వాలి. పాలు బాగా కాగి, సగబాగానికి వచ్చే సమయంలో అందులో మామిడి గుజ్జును వేసి, మంట ఎక్కువగా పెట్టి బాగా కలపాలి. చిక్కటి పాలు, మామిడి పండు రెండూ ఒకదానితో ఒకటి బాగా మిక్స్ అయ్యేంత వరకూ కలుపుతూనే ఉండాలి.
3. ఒక్కసారిగా మామిడిపండు, పాలు మిశ్రమం గట్టిపడే సమయంలో పంచదార, నెయ్యిని కలుపుకోవాలి. పంచదార, నెయ్యి కూడా బాగా కలిసిపోయేలా మిక్స్ చేయాలి.
4. ఇప్పుడు మంట తగ్గించి మరి కొద్దిసేపు స్టౌ మీదనే పెడితే మిశ్రమం అంత గట్టి పడుతూ కోవా మృదువుగా తయారవుతుంది. స్టౌ ఆఫ్ చేసి పాన్ ను క్రింది దింపుకోవాలి.
5. ఒక ప్లేట్ కు కొద్దిగా నెయ్యి రాసి అందులో కోవా మిశ్రమాన్ని పోసి గోరు వెచ్చగా చల్లారనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు కావలసిన ఆకారంలో కట్ చేసుకొని, తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల కోవా చల్లారే కొద్ది గట్టిపడుతుంది. తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిజ్ లో పెట్టి కావల్సినప్పుడు బయటకు తీసి కూల్ కూల్ గా సర్వ్ చేసుకోవచ్చు. అంతే మ్యాంగో కోవా రెడీ.
సూచన:
1. పాలు కాచేటప్పుడు పాలు గిన్నె మాడకుండా కలబెడుతూనే ఉండాలి.
2. మామిడి పండ్లు రుచిని బట్టి పంచదారను ఎక్కువ, తక్కువ వేసుకోవచ్చు.
3. కావాలనుకొంటే కొద్దిగా పచ్చి కోవాను, యాలకుల పొడిని కూడా మిక్స్ చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications