Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
పన్నీర్ అమ్రిత్ సరీ: ఈజీ అండ్ హెల్తీ స్నాక్ రిసిపి
ఈ హెల్తీ పన్నీర్ అమ్రిత్ సరీ స్నాక్ రిసిపిని చాలా త్వరగా 10నిముషాల్లో టేస్టీగా తయారుచేసుకోవచ్చు . ఈ పన్నీర్ అమ్రిత్ సరీ స్నాక్ రిసిపి, ఇతర పనీర్ వంటలైన పన్నీర్ టిక్కా లేదా పనీర్ 65 లేదా పన్నీర్ పకోడా వలే ఉంటుంది. ఇది ఒక రుచికరమైన స్టార్టర్ లేదా పిల్లల లంచ్ బాక్స్ కు ఒక సైడ్ డిష్ వంటింది .
ముఖ్యంగా పిల్లలకు అందించే ఆపిల్ ఫ్రైడ్ రైస్, వెజ్ పులావ్, పుదీనా రైస్ వంటలకు ఇది ఒక చక్కటి కాంబినేషన్. ఇంకా ఇది సాయంత్రపు టీ టైమ్ లో ఒక ఫర్ఫెక్ట్ ఈవెనింగ్ స్నాక్ అని చెప్పవచ్చు. మరి ఈ గ్రేట్ అండ్ టేస్టీ ఈవెనింగ్ స్నాక్ ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
పనీర్ (మలై పనీర్ బాగుంటుంది): 2cups
అజ్వైన్(కారం సీడ్స్): 1/2tsp
కారం: 1/2 to 3/4tsp
తందూరి మసాలా పౌడర్ లేదా గరం మసాలా: 1tsp
మ్యాంగో పౌడర్: చిటికెడు
పెప్పర్ పౌడర్: చిటికెడు(మీకు అవసరం అయినంత)
కస్తూరి మేతి: 1/4tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు : కొద్దిగా
శెనగపిండి: 2tbsp
నూనె: సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా పనీర్ ను మీరు మార్కెట్లో కొనుగోలు చేసేట్లు అయితే, వాటని బాగా శుభ్రంగా కడగాలి.
2. శెనగపిండి మరియు నూనె తప్పించి, మిగిలిన పదార్థాలన్నింటిని ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేయాలి . తర్వాత అందులో కొద్దిగా నీళ్ళు పోసి పేస్ట్ చేయాలి.
3. ఈపేస్ట్ తీసుకొని పన్నీర్ కు పట్టించి 5 నిముషాలు పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ కు సరిగా పట్టకపోతే, కొద్దిగా నీరు చిలకరించాలి.
4.ఇప్పుడు పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక, అందులో అజ్వైన్ వేసి చిటపటలాడిన తర్వాత అందులో మ్యారినేట్ చేసిన పన్నీర్ వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి. నూనె పైకి తేలే వరకూ కనీసం 5నిముషాల పాటు దీన్ని ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత పాన్ లో అదనపు నూనెను బౌల్లోనికి వంపేసుకోవాలి.
6. తర్వాత పాన్ లో ఉన్న పన్నీర్ ముక్కలు మొత్తం మీద కొద్దిగా శనగపిండిని చిలకరించాలి.
7. రెండు నుండి 5 నిముషాల వరకూ రోస్ట్ చేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని సర్వింగ్ ప్లేట్ లోనికి మార్చుకోవాలి. లేదంటే పన్నీర్ రబ్బర్ లాగా మారిపోతుంది.
8. కొత్తిమీర తరుగు మరియు ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేస్తే చూడటానికి అందంగా, తినడటానికి టేస్టీగా ఉంటుంది.



Click it and Unblock the Notifications