Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
పైనాపిల్ బిస్కెట్స్

మైదా : 1/2kg
బేకింగ్ పౌడర్ : 1tsp
పంచదార : 200grm
తినే సోడా : చిటికెడు
పైనాపిల్ ఎసెన్స్ : 1tsp
కోడి గుడ్లు : 2
వెన్న : 100grm
తయారు చేసే విధానం :
1. పంచదారను మెత్తగా పొడిలా చేసుకోవాలి. మైదా పిండిని జల్లించుకోవాలి. ఒక గిన్నె తీసుకుని అందులో గుడ్లు పగులగొట్టి తెల్లసొనను మాత్రం తీసుకోవాలి. దీనిని ఎగ్ బీటర్తో కానీ గ్రైండర్‌లో కానీ వేసి బాగా కలపాలి.
2. మైదాను రాత్రి పూటకానీ పొద్దునకానీ తడిపి బాగా మృదువుగా అయ్యేలా కలుపుకోవాలి. ఉదయం చేసేట్లు అయితే పిండిని ముందు రోజు రాత్రి, సాయంత్రం చేసుకోవాలనుకుంటే ఉదయంపూట పిండిని తడిపి వుంచుకోవాలి. అలా చేస్తేనే బిస్కెట్స్ గుల్లగా వుండి కరకరలాడుతుంటాయి.
3. ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో కోడి గుడ్డును పగుల గొట్టి వేయాలి. దానిలో చక్కెర పొడిని వేసి బాగా కలియబెట్టాలి. 4. తర్వాత మైదాపిండిలో బేకింగ్ సోడా, వెన్న వేసి కలపాలి. తరువాత గుడ్డు సోనలో పైనాపిల్ ఎస్సెన్సు వేసి బాగా బ్లెండ్ చేసి దీన్ని మైదా పిండిలో వేసి కలపాలి.
5. ఇప్పుడు పంచదార మిశ్రమంలో దీన్నంతటిని వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని నాలుగు లేదాఐదు గంటల పాటుపక్కన వుంచుకోవాలి.
6. తరువాత వాటిని పూరీల్లా వత్తుకోవాలి. వీటిని నచ్చిన ఆకారంలో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కేక్ పాన్ తీసుకుని అందులో ప్రత్యేకంగా వుండే గిన్నెలో బిస్కెట్స్‌ను పెట్టి బేక్ చేయాలి. లేత బంగారు రంగు వచ్చే వరకు అలా వుంచేయాలి. అంతే పైనాపిల్ బిస్కెట్స్ రెడీ.



Click it and Unblock the Notifications