Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
షుగర్ ఫ్రీ స్వీట్స్-అంజీర, ఖర్జూర బర్ఫీ

అంజీరా: 2cups
గింజ తీసిన ఖర్జూరాలు: 2cups
బాదం పప్పులు : 25-30
జీడిపప్పు : 15-20
పిస్తాలు : 15-20
నెయ్యి : 1/2cup
సిల్వర్ ఫాయిల్: 1-2 షీట్లు
తయారు చేయు విధానం:
1. ముందుగా అంజీరాలను రెండు కప్పుల నీళ్ళలో మూడు నుంచి నాలుగు గంటలపాటు నానపెట్టాలి. తరువాత వాటిని వడకట్టి అవసరమైతే నీళ్ళు పోసి గుజ్జులా తయారు చేయాలి. మరికొన్ని అంజీరాలను ఒక కప్పు వేడినీటిలో రెండు మూడు నిమిషాలు ఉండనిచ్చి బయటకి తీసి చల్లబడనివ్వాలి. అవసరమైతే కాసిన నీళ్ళు పోసి దాన్ని కూడా గుజ్జులా తయారు చేసుకోవాలి.
2. తర్వాత సీడ్‌లెస్ ఖర్జూరాలను తీసుకుని సన్నని ముక్కలుగా తరుక్కుని అరకప్పు వేడి నీటిలో పావుగంట నుంచి ఇరవై నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత వాటిని కూడా బయటకు తీసుకుని గుజ్జులా తయారు చేసుకోవాలి. దీనితో పాటు కొన్ని ఖర్జూరాలు తీసుకొని ముప్పై సెకెన్ల పాటు ఒవెన్‌లో ఉడికించి దానిని కూడా అవసరమైతే నీళ్ళు పోసి గుజ్జుగా చేసుకోవాలి.
3. బాదం, పిస్తా, జీడిపప్పులను చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. తర్వాత నేతిని మందబాపాటి గిన్నె లేదా బాణలిలో వేడి చేసి దానిలో ఈ అంజీర, ఖర్జూరాల గుజ్జును పోయాలి. మీడియం మంట మీద పది నుంచి పావు గంటసేపు అందులోని నీరంతా ఇంకిపోయే దాకా ఉడికించాలి. ఈ మిశ్రమం ఉండలు చుట్టుకోకుండా తిప్పుతూ ఉండాలి.
4. తర్వాత అందులో తరిగి పెట్టుకున్న బాదం, పిస్తా, జీడిపప్పు ముక్కలను వేసి కలిసేలా తిప్పాలి. ఉండకట్టకుండా తిప్పుతూ మరో పావుగంట సేపు ఉడికించి అది పక్కలకు అంటుకోవడం మానేసినప్పుడు దించి ఒక ట్రేకి నెయ్యి రాసి అందులో పోయాలి. దానిపై సిల్వర్ ఫాయిల్ కప్పాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా చేసి తినడమే ఆలస్యం..



Click it and Unblock the Notifications