రుచికరమైన వెరైటీ టమోటో దోసె

Tasty Tomato Dosa
దోసె అంటే తెలియని వారుండరు. ముఖ్యంగా ఉదయం అయిందంటే చాలు ఏం టిఫిన్ చేదాం... అని ఆలోచిస్తుంటారు. ఎక్కువగా దోసె, ఇండ్లీ ఇటువంటి అల్పాహారానికే ఇష్టపడుతుంటారు చాలా మంది. అయితే మన దేశంలో దోసెలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తయారు చేస్తారు. ఎలా తయారు చేసినా రుచి మాత్రం అమోఘం. అద్వితీయం. కాకా హోటళ్ల దగ్గర నుంచి కార్పొరేట్ హోటళ్లదాకా తిరుగులేని వివిధ దోసెల తయారు చేస్తుంటారు. అందులో ఒక్కటి టమోటో దోసె. చూడగానే నోరూరించే ఈ దోసెలు పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు.

కావలసిన పదార్థాలు:
టమోటోలు: 2
దోసె పిండి: ఒక గిన్నె
ఇంగువ: చిటికెడు
కారం : 1tsp
ధనియా: 1tsp
టమోటో సాస్: 1tbsp
కొత్తిమీర తరుగు: 1tbsp
కరివేపాకు తరుగు: tbsp
ఉప్పు: రుచికి తగినంత


తయారు చేయు విధానం:

1. టమోటో ముక్కలను మిక్సీలో వేసి బాగా మొత్తని పేస్ట్ లా తయారు చేయాలి.
2. తర్వాత ఒక బౌల్ లో టమోటో పేస్ట్ ను, టమోటో సాస్ ను, కారం, ధనియా, పసుపు, ఇంగువ, ఉప్పు, కొత్తిమీర తరుగు, కరివేపాకు తరుగు వేసి బాగా కలపాలి.
3. ఇప్పుడు ఈ మిశ్రమంలో దోసె పిండి వేసి అంతా కలగలపాలి.
4. తర్వాత స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి వేడయ్యాక దోసె పోసి తర్వాత నూనె వేసి మీడియం మంట మీద కాలనివ్వాలి.
5. అంతే టమోటో దోసె రెడీ. ఈ వేడి వేడి టమోటో దోసెను సాంబార్ లేదా చట్నీతో సర్వ్ చేయాలి.

Story first published: Tuesday, June 26, 2012, 12:13 [IST]
Desktop Bottom Promotion