చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి

Posted By:

ఇంట్లో తరచుగా చపాతీలు, దోశలు చేసుకుంటున్నారా? అయితే వాటిలోకి ఎప్పుడూ రొటీన్‌ గా చేసుకునే చట్నీలు, పప్పు, కుర్మాలు తిని బోర్ కొట్టిందా? కాస్త భిన్నంగా, స్పైసీగా ఏదైనా కొత్త రుచిని ట్రై చేయాలనిపిస్తోందా? అయితే మీ ఇంట్లో ఉన్న గుడ్లతో మలేషియాలో ఎంతో ఫేమస్ అయిన ఎగ్ మసాలాని తయారు చేసి చూడండి.

సాధారణంగా మనం గుడ్లతో ఆమ్లెట్, ఎగ్ బుర్జీ లేదా పులుసు చేసుకుంటాం. కానీ ఈ మలేషియన్ ఎగ్ మసాలా రుచి చాలా విభిన్నంగా, అద్భుతంగా ఉంటుంది. ఇది చపాతీ, దోశ లాంటి టిఫిన్స్‌లోనే కాకుండా వేడి వేడి అన్నంలోకి కూడా పర్ఫెక్ట్‌ గా సెట్ అవుతుంది. ఈ మలేషియన్ స్పెషల్ వంటకాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

Spicy and Flavorful Malaysian Egg Masala A Must Try Egg Recipe in Telugu

కావలసిన పదార్థాలు

మసాలా కోసం
పెద్ద ఉల్లిపాయ - 1
సాంబార్ ఉల్లిపాయలు - 5
కాశ్మీరీ ఎండుమిర్చి - 15
వెల్లుల్లి రెబ్బలు - 10
అల్లం - 1 అంగుళం ముక్క
నూనె - 4 టేబుల్ స్పూన్లు
నీళ్లు - 4 టేబుల్ స్పూన్లు
గుడ్లు వేయించుకోవడానికి:
ఉడికించిన గుడ్లు - 4
నూనె - 1 టేబుల్ స్పూన్
కారం - అర టేబుల్ స్పూన్
మిరియాల పొడి - అర టేబుల్ స్పూన్
పసుపు - అర టేబుల్ స్పూన్
ఉప్పు - అర టేబుల్ స్పూన్
గ్రేవీ తయారీకి
నూనె - 4 టేబుల్ స్పూన్లు
చిక్కటి చింతపండు రసం - 2 టేబుల్ స్పూన్లు
బెల్లం తురుము - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 1 కప్పు
పెద్ద ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 2

ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్‌ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే..

తయారీ విధానం

-ముందుగా కాశ్మీరీ ఎండుమిర్చిని తీసుకుని గోరువెచ్చని నీటిలో 10 నిమిషాల పాటు నానబెట్టాలి.

-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని.. అందులో నానబెట్టిన ఎండుమిర్చి, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వేయాలి. దానికి 4 టేబుల్ స్పూన్ల నూనె, కొద్దిగా నీళ్లు జతచేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి.

-స్టవ్ మీద పాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేయాలి. అందులో కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, మిరియాల పొడి వేసి కలిపాక, ఉడికించిన గుడ్లను వేసి దోరగా వేయించాలి. మసాలా పట్టిన ఈ గుడ్లను ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు అదే పాన్‌ లో మరో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్‌ ను అందులో వేసి పచ్చివాసన పోయేలా 5 నిమిషాల పాటు మీడియం మంటపై వేయించాలి.

-పేస్ట్ వేగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు, బెల్లం, చింతపండు రసం వేసి.. నూనె పైకి తేలేవరకు బాగా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒక కప్పు నీళ్లు పోసి బాగా కలపాలి.

-గ్రేవీ ఉడుకుతూ నూనె పైకి తేలుతున్న సమయంలో పొడవుగా కోసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసి ఉల్లిపాయలు కాస్త మెత్తబడి రంగు మారే వరకు ఉడికించాలి.

-చివరగా, ముందుగానే వేయించి పెట్టుకున్న గుడ్లను ఈ గ్రేవీలో వేసి..మసాలా మిశ్రమం గుడ్లకు బాగా పట్టేలా బాగా కలిపి దించేయాలి.

-అంతే ఎంతో గుమగుమలాడే, నోరూరించే మలేషియన్ ఎగ్ మసాలా రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, September 27, 2026, 9:30 [IST]
Desktop Bottom Promotion