Latest Updates
-
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే.. -
గుడిలో ప్రసాదంలా రోజంతా కమ్మగా ఉండే దద్దోజనం..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రెషర్ కుక్కర్ మూత పక్కల నుండి ఆవిరి లీక్ అవుతోందా? ఈ చిట్కాతో ఆ సమస్యకు చెక్! -
సిరిసంపదలు పెరగాలంటే ఇల్లు ఎలా తుడవాలి? కచ్చితంగా పాటించాల్సిన వాస్తు నియమాలు -
నవరాత్రి ఉపవాస స్పెషల్.. నానబెట్టే పనే లేకుండా అప్పటికప్పుడు సగ్గుబియ్యం వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా..
వేడి వేడి అన్నం, రసంలోకి అదిరిపోయే కాంబినేషన్.. తమిళనాడు ఫేమస్ కొంగు చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలంటే
ప్రతి వారం రోజూ చేసుకునే అవే పాత చికెన్ గ్రేవీ, చికెన్ వేపుడు తిని మీకు విసుగు పుట్టిందా? రొటీన్ రుచులకు భిన్నంగా ఏదైనా కొత్తగా, నోటికి కమ్మగా తినాలనిపిస్తోందా? అయితే కొంగునాడు స్టైల్ చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి. తమిళనాడులోని కొంగు ప్రాంతంలో ఈ చికెన్ రోస్ట్ చాలా ఫేమస్. ఇది తయారు చేయడం ఎంత సులభమో, రుచి కూడా అంతే అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి బిర్యానీ, రసం అన్నం, సాంబార్ రైస్ లేదా నెయ్యి అన్నంలోకి ఈ కొంగు స్పెషల్ చికెన్ రోస్ట్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పవచ్చు.

కొంగు చికెన్ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు
దాల్చిన చెక్క: 2 అంగుళాల ముక్క
లవంగాలు: 4
బిర్యానీ ఆకు: 1
మిరియాలు: 1 చెంచా
జీలకర్ర: 3 టేబుల్ స్పూన్లు
సోంపు: అర చెంచా
గసగసాలు: అర చెంచా
ఎండు మిరపకాయలు: 10
పచ్చి కొబ్బరి తురుము: 5 చెంచాలు
చికెన్: అర కిలో
నూనె: 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ: 1
పసుపు పొడి: అర చెంచా
ఉప్పు:సరిపడా
కరివేపాకు: గుప్పెడు
కొత్తిమీర: అర కప్పు
నీళ్లు: అవసరమైనంత

కొంగు చికెన్ ఫ్రై తయారీ విధానం
-ముందుగా అరకిలో చికెన్ ను తీసుకుని, కొద్దిగా పసుపు వేసి బాగా కడగాలి. నీరంతా వడకట్టి చికెన్ ను ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, జీలకర్ర, సోంపు, గసగసాలు వేసి కమ్మటి సువాసన వచ్చే వరకు సన్నటి మంట మీద దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులోనే ఎండు మిరపకాయలు, కొబ్బరి తురుము వేసి మరో నిమిషం పాటు వేయించాలి. ఎండుమిర్చి మాడిపోకుండా చూసుకోవాలి. కొబ్బరి కాస్త రంగు మారగానే స్టవ్ ఆపేయాలి. ఈ మసాలా మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత మిక్సీ జార్ లో వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
-ఇప్పుడు అదే బాండీలో లేదా మరొక కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగాక, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి అవి పారదర్శకంగా మారే వరకు వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఉప్పు, పసుపు వేసి కలుపుకోవాలి. వెంటనే కడిగి పెట్టుకున్న చికెన్ వేసి బాగా కలపాలి. చికెన్ రంగు మారి, అందులో నుంచి నీరు బయటకు వచ్చే వరకు మగ్గనివ్వాలి.
-ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ను చికెన్‌కు పట్టించి బాగా కలపాలి. చికెన్ పూర్తిగా ఉడికి, నూనె పైకి తేలే వరకు మీడియం మంట మీద ఉడికించాలి. చికెన్‌లోని నీళ్లన్నీ పూర్తిగా ఇంకిపోయి, మసాలా అంతా ముక్కలకు పట్టి రోస్ట్ లా మారే వరకు కొన్ని నిమిషాల పాటు ఓపికగా వేయించుకోవాలి.
-చివరగా గుప్పెడు కరివేపాకు, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని, ఒకసారి బాగా కలిపి కొన్ని సెకన్ల పాటు ఉంచి స్టవ్ ఆపేయాలి. అంతే ఎంతో రుచికరమైన, నోరూరించే వేడి వేడి కొంగునాడు స్పెషల్ చికెన్ ఫ్రై రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
