Latest Updates
-
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు?
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
సాధారణంగా ఇళ్లలో శనగపిండితో లేదా ఉల్లిపాయలతో పకోడాలు వేస్తుంటారు. కానీ, ఎప్పుడూ తినే రొటీన్ రుచులకు భిన్నంగా, మరింత రుచికరమైన, ఆరోగ్యకరమైన కొత్త వెరైటీని మీరు ట్రై చేయాలనుకుంటే..పంచ్ మెల్ దాల్ పకోడా మీకు సరైన ఎంపిక.
ఐదు రకాల పప్పుల మిశ్రమం, పాలకూర, ఘాటైన అల్లం-పచ్చిమిర్చి కలయికతో తయారయ్యే ఈ పకోడాలు పైన కరకరలాడుతూ, లోపల నోట్లో కరిగిపోయేంత మృదువుగా ఉంటాయి. పంచ్ మెల్ దాల్ పకోడా మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
శనగపప్పు - పావు కప్పు
పెసరపప్పు (పొట్టులేనిది) - పావు కప్పు
కందిపప్పు - పావు కప్పు
మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు) - పావు కప్పు
మినపపప్పు - పావు కప్పు
పచ్చిమిర్చి - 2 లేదా 3
నల్ల మిరియాలు - 8 నుండి 10
అల్లం - 2 అంగుళాల ముక్క
గరం మసాలా - 1 టీస్పూన్
సన్నగా తరిగిన పాలకూర - 1 కప్పు
పచ్చి కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి
తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో ఐదు రకాల పప్పులను వేసి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి సుమారు 2 నుంచి 3 గంటల పాటు నానబెట్టాలి. పప్పులు బాగా నానిన తర్వాత, చుక్క నీరు కూడా లేకుండా పూర్తిగా వడకట్టేయాలి.
-ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని.. నానబెట్టుకున్న పప్పుల మిశ్రమం, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, మిరియాలు వేసి బరకగా రుబ్బుకోవాలి.ఈ మిశ్రమంలో అస్సలు నీళ్లు పోయకూడదు. పకోడాలు కరకరలాడాలంటే పిండి గట్టిగా ఉండటం చాలా ముఖ్యం.
-రుబ్బుకున్న పప్పుల మిశ్రమాన్ని ఒక వెడల్పాటి గిన్నెలోకి తీసుకోవాలి. అందులో సన్నగా తరిగిన తాజా పాలకూర, కొబ్బరి తురుము, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి చేత్తో బాగా కలుపుకోవాలి. ఈ పిండిని కనీసం 2 నిమిషాల పాటు చేత్తో బాగా గిలకొట్టినట్లుగా కలపాలి. ఇలా చేయడం వల్ల పిండిలో గాలి చేరి, పకోడాలు లోపల గుల్లగా, సాఫ్ట్ గా వస్తాయి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి.. పిండిని చిన్న చిన్న పకోడాలుగా నూనెలో వేయాలి. ఇవి అన్ని వైపులా అందమైన బంగారు రంగులోకి మారి, కరకరలాడేలా వేయించుకోవాలి.
-ఎంతో రుచికరమైన పంచ్ మెల్ దాల్ పకోడాలు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
