Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
సమ్మర్ స్పెషల్..ఇంట్లోనే రోజ్ మిల్క్ ఇలా చేసుకోండి..మండే ఎండలో చల్లగా ఉంటారు
ప్రస్తుతం ఉదయం నుంచే భానుడి భగభగలు మొదలవుతున్నాయి. సమ్మర్ లో చాలామంది ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు చల్లగా ఏదైనా కూల్ డ్రింక్ ని తాగుతుంటారు. అయితే రోజ్ మిల్క్..సమ్మర్ లో తాగడానికి బెస్ట్ డ్రింక్. మిట్టమధ్యాహ్నాం ఓ పక్క ఎర్రటి ఎండ..మరోపక్క చల్లటి రోజ్ మిల్క్ తాగుతుంటే ఈ జీవితానికి ఇంతకుమించి ఏం కావాలి అనిపిస్తుంది. చాలామంది సమ్మర్ లో షాపుల దగ్గరకు వెళ్లి రోజ్ మిల్క్ కొనుక్కోని తాగుతుంటారు. అయితే దీనిని ఇంట్లోనే చాలా ఈజీగా 5 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. రోజ్ మిల్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.
రోజ్ మిల్క్ తయారీకి కావాల్సిన పదార్థాలు
-పాలు
-సబ్జా గింజలు
-రోజ్ వాటర్
-రోజ్ సిరప్
-ఐస్ క్యూబ్స్
-గులాబీ రేకులు
-చక్కెర

రోజ్ మిల్క్ తయారీ విధానం
-ముందుగా అరలీటరు చిక్కటి పాలను కాచి చల్లార్చి ఫ్రిడ్జ్ లో పెట్టండి.
-తర్వాత రెండు టేబుల్ స్పూన్ల సబ్జా గింజలు నానబెట్టండి.
-కొద్దిసేపటి తర్వాత ఓ పెద్ద గ్లాస్ లేదా బెంబులో ఫిడ్జ్ లో పెట్టిన పాలను పోసి ఇందులో 1 టీస్పూన్ రోజ్ వాటర్, 2 టేబుల్ స్పూన్ల చక్కెర, పావు కప్పు రోజ్ సిరప్, నాలుగైదు ఐస్ క్యూబ్ లు,నాలుగైదు గులాబీ రేకులు, నానబెట్టిన సబ్జా గింజలు వేసి మూతపెట్టి 3 నిమిషాలు బాగా షేక్ చేయండి.
-తర్వాత మూత తీస్తే క్రీమీగా రోజ్ మిల్క్ రెడీ. దీన్ని తాగితే అబ్బా ఏముంది అని తీరాల్సిందే.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications