Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్: తారల సందడితో హోరెత్తుతున్న వేదిక.. ఫోటోలు వైరల్! -
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు -
ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే పడేయకుండా ఇలా రుచికరమైన బ్రెడ్ ఉప్మా చేసేయండి! -
ఎండల దెబ్బకు మారుతున్న పెళ్లిళ్ల ముహూర్తాలు.. అసలు ఏం జరుగుతోంది? -
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026
నవరాత్రి స్పెషల్-మాల్పువా స్వీట్
దుర్గా పూజలో ప్రసిద్ధ బెంగాలీ స్వీటు మాల్ పువాని ఉపయోగిస్తారు.అసలు ఈ స్వీటు లేకుండా బెంగాలీలకి నవరాత్రులు పూర్తి కావు అలాగే డిశంబరు నెలలో వచ్చే పిఠే-పులి ఉత్సవ్ లేదా పాన్‌కేక్స్ మరియూ మోమోస్ ఉత్సవంలో కూడా ఈ స్వీటు తయారు చేస్తారు.
ఇంట్లో చేసిన స్వీట్లు ఏవైనా సరే రుచికరంగా ఉంటాయి ఇక మాల్ పువా అయితే మీరు చివరి ముక్క వరకూ ఆపకుండా తిని చేతులు కూడా వదలకుండా నాకుతారు.
ఈ స్వీటు తయారీ బాగా సులభం పైగా దీనిని ఇంట్లో ఉండే పదార్ధాలతోనే తయారు చేసుకోవచ్చు.మరింక ఆలశ్యమెందుకు ఈ విజయ దశమికి మీ ఇంట్లో మాల్ పువా చేసి రబ్రీ, బాదం, కుంకుమ పువ్వుతో అలంకరించి మీ అతిథులకి వడ్డించి వారి మనసు దోచుకోండి.
ఎంత మందికి సరిపోతుంది-4
వండటానికి పట్టే సమయం-20 నిమిషాలు
సమాగ్రి సమకూర్చుకోవడానికి-25 నిమిషాలు
కావాల్సిన పదార్ధాలు:
- మైదా లేదా రీఫైండ్ ఫ్లోర్-ఒక కప్పు
- సేమోలీన-400 గ్రాములు
- వాము-అర టేబుల్ స్పూను
- ఎల్లో ఫుడ్ కలర్
- పాలు-2 కప్పులు
- పంచదార-1 కప్పు
- నీళ్ళు-ఒక కప్పు
- గార్నిషింగ్ కోసం-కుంకుమ రేకులు, బాదాం,రబ్రీ స్వీట్
తయారు చేయు విధానం:

1.ఒక పెద్ద గిన్నెలో మైదా(రీఫైండ్ ఫ్లోర్), సెమోలీనా, వాము, ఎల్లో ఫుడ్ కలర్, పాలు వేసి జారు పిండిలాగ కలుపుకోవాలి.

2.ఈ పిండిని వేడి నూనెలో వేసి గోధుమ రంగు వచ్చేవరకూ వేయించాలి.

3.నూనెలోనుండి తీసి పంచదార పాకంలో వేసి 2-3 నిమిషాలు ఉంచాలి.

4.కొంచం రబ్రీ స్వీటు, కుంకుమ రేకులు,బాదాం పప్పులని మాల్ పువా మీద వేసి సర్వ్ చెయ్యాలి.



Click it and Unblock the Notifications