Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయా? పీరియడ్స్ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్: తారల సందడితో హోరెత్తుతున్న వేదిక.. ఫోటోలు వైరల్! -
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు -
ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే పడేయకుండా ఇలా రుచికరమైన బ్రెడ్ ఉప్మా చేసేయండి! -
ఎండల దెబ్బకు మారుతున్న పెళ్లిళ్ల ముహూర్తాలు.. అసలు ఏం జరుగుతోంది? -
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026
నవరాత్రి స్పెషల్: స్వీట్ రైస్ రెసిపీ
ఇది నవరాత్రుల సమయం.మీ ఇంటిలో రోజూ అతిధులుంటున్నారు కదా.వారికి వండి పెట్టడానికి కొత్త కొత్త వంటలకోసం చూస్తున్నారా??అందుకే ఈరోజు మేము సులభంగా తయారయ్యే స్వీట్ రైస్ తయారీని ఇచ్చాము.నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ఇది చేసి చూడండి.ఈ రైస్‌ని నిమిషాల్లో తయారు చెయ్యచ్చు.
నవరాత్రుల్లోనే కదా మీరు మీ కుటుంబ సభ్యులందరితో కలిసి గడూపుతారు. ముఖ్యంగా మీ పిల్లలతో. మరి ఈ స్వీట్ తయారు చేసి వారికి పెట్టి వారి మోములో విరిసే నవ్వులని చూడండిక.
దీనికి కావాల్సిన పదార్ధాలు ఎప్పుడూ మీ వంటింట్లో ఉండేవే. ఇక ఈ రైస్ తయారీ విధానం చూద్దామా..
ఎంత మందికి సరిపోతుంది-6
తయారీ సమయం-5-10 నిమిషాలు
వండటానికి పట్టే సమయం-10 నిమిషాలు
కావాల్సిన పదార్ధాలు:
1.వండి చల్లార్చిన అన్నం-7 కప్పులు
2.పంచదార-ఒకటిన్నర కప్పు
3.దాల్చిన చెక్క-2-4 ముక్కలు
4.బిర్యానీ ఆకులు-2
5.లవంగాలు-2-4
6.నెయ్యి-4 టేబుల్ స్పూన్లు
7.పాలల్లో నాన బెట్టిన కుంకుమ రేకులు-కొన్ని
8.కుంకుమ రంగు ఫుడ్ కలర్-కొన్ని చుక్కలు
గార్నిషింగ్ కోసం:
బాదాం,పిస్తా పప్పులు-ఒక స్పూను చొప్పున
తయారీ విధానం:

1.వండిన అన్నాన్ని ఒక గిన్నెలో తీసుకుని దానికి పంచదార కలపాలి.
2.ఒక నాన్ స్టిక్ ప్యాన్ వేడి చేసి నెయ్యి వేసి వేడి చెయ్యాలి.

3.నెయ్యిలో దాల్చిన చెక్క,లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి.
4.దీనిలో పంచదార కలిపిన అన్నం వేసి బాగా కలపాలి.

5.ఈ మిశ్రమానికి పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు, కాస్త ఫుడ్ కలర్ కలపాలి.
6.అన్నింటినీ కలిపి సన్నని మంట మీద 4-5 నిమిషాలు పంచదార కరిగేవరకూ ఉంచాలి.

7.స్టవ్ మీద ఈ మిశ్రమాన్ని నీరు పూర్తిగా ఇగిరిపోయేవరకూ ఉంచాలి.
8.అంతే, మీ స్వీట్ రెడీ.

9.దీనిని సర్వింగ్ ప్లెటులో తీసుకుని బాదాం,జీడి పప్పు,పిస్తా పప్పులతో అలంకరించి పైన ఏలకుల పొడి వేసి వడ్డించడమే.
ఈ స్వీట్ రైస్ చెయ్యడం ఇంత సులభం.చాలా ఇళ్ళల్లో ఈ స్వీటుని శుభ కార్యాలు ప్రారంభించే ముందు చేసుకుంటూ ఉంటారు.

ఈ స్వీటుని నవరాత్రుల్లో ప్రయత్నించి ఎలా ఉందో మాకు తెలియచెయ్యండి.



Click it and Unblock the Notifications