Latest Updates
-
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే! -
చపాతీ, దోశల్లోకి అదిరిపోయే మలేషియన్ ఎగ్ మసాలా..4 గుడ్లు ఉంటే ఈజీగా ఇలా చేసేయండి -
ఫైబర్, పోషకాలు నిండిన పర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్..సొరకాయ మునగాకు ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్స్టా వ్యామోహం.. 18 ఏళ్ల యువకుడి కోసం ముగ్గురు పిల్లలను వదిలేసిన 38 ఏళ్ల మహిళ, చివరికి.! -
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే!
రెస్టారెంట్ రుచిని తలపించే లెమన్ చికెన్ టిక్కా.. ఇంట్లోనే సులభంగా చేసుకోండిలా!
క్రీమీగా, కాస్త పుల్లగా, మసాలాల ఘాటుతో కమ్మగా ఉండే లెమన్ చికెన్ టిక్కా రుచి చూస్తే ఆ మజానే వేరు. పక్కన కాస్త ఘాటైన పుదీనా చట్నీ, ఉల్లిపాయ రింగ్స్ పెట్టుకుని తింటే.. ఆ రుచికి ఫిదా అవ్వాల్సిందే. రెస్టారెంట్ రుచిని తలపించే లెమన్ చికెన్ టిక్కా ఇంట్లోనే సులభంగా ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.
లెమన్ చికెన్ టిక్కా తయారీకి కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్ - 500 గ్రాములు
గట్టి పెరుగు - అర కప్పు
కాశ్మీరీ ఎర్ర కారం పొడి - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
అల్లం-వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్నర టీస్పూన్
పసుపు పొడి - అర టీస్పూన్
ధనియాల పొడి - 1 టీస్పూన్
జీలకర్ర పొడి - అర టీస్పూన్
తాజా నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు
వంట నూనె - 1 టేబుల్ స్పూన్
చెక్క పుల్లలు - 8
నిమ్మకాయ ముక్కలు- 8
బటర్ - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - మీ రుచికి తగినంత

లెమన్ చికెన్ టిక్కా తయారీ విధానం
-ముందుగా బోన్ లెస్ చికెన్ ను తీసుకుని శుభ్రంగా కడగాలి. వాటిని చిన్న చిన్న టిక్కా ముక్కలుగా కోసుకోవాలి. ఒక టిష్యూ పేపర్ తీసుకుని చికెన్ ముక్కలకు ఉన్న తడి అంతా పోయేలా అద్దుతూ తుడవాలి. తడి లేకపోతే మసాలాలు ముక్కలకు బాగా పడతాయి. ఇప్పుడు ఈ ముక్కలను ఒక పెద్ద మిక్సింగ్ గిన్నెలో వేయండి.
-ఒక ఫోర్క్ తీసుకుని చికెన్ ముక్కలకు చిన్న చిన్న గాట్లు పెట్టండి. ఆ తర్వాత ఆ గిన్నెలో గట్టి పెరుగు, కాశ్మీరీ కారం పొడి, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు వేసి చేత్తో బాగా కలపాలి.
-ఇప్పుడు అదే గిన్నెలో అల్లంవెల్లుల్లి పేస్ట్,నిమ్మరసం, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి చికెన్ ముక్కలకు ప్రతి మసాలా సమానంగా పట్టేలా అద్భుతంగా కలపండి. ఈ గిన్నెపై మూత పెట్టి 8 గంటల పాటు ఫ్రిజ్ లో ఉంచండి.
-చికెన్ కాల్చడానికి వాడే చెక్క పుల్లలను కనీసం 20 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల పాన్‌పై కాల్చేటప్పుడు పుల్లలు మాడిపోకుండా ఉంటాయి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను తీసుకుని, పుల్లలకు గుచ్చాలి. మధ్యమధ్యలో నిమ్మకాయ స్లైసెస్ ను కూడా గుచ్చుతూ (ఒక చికెన్ ముక్క, ఒక నిమ్మకాయ ముక్క) అమర్చండి.
-స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి నాన్ స్టిక్ పాన్ లేదా గ్రిల్ పాన్ పెట్టి వేడి చేయండి. దానిపై కొద్దిగా వెన్న వేసి కరిగించండి. ఇప్పుడు చికెన్ గుచ్చిన పుల్లలను పాన్ పై మెల్లగా ఉంచండి. చికెన్ ముక్కలు అన్ని వైపులా గోధుమ రంగులోకి మారి, కొద్దిగా కాల్చినట్లుగా అయ్యేంత వరకు అటూ ఇటూ తిప్పుతూ ఉడికించండి. చివరగా కరిగించిన వెన్న, కొద్దిగా నిమ్మరసం ఆ చికెన్ టిక్కాలపై చల్లండి.
-అంతే ఎంతో కమ్మని లెమన్ చికెన్ టిక్కా రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
