Latest Updates
-
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా?
వంకాయ వండటం ఓ కళ.. అయ్యంగార్ స్టైల్ లో ఇలా చేస్తే రుచికి ఎవరైనా దాసోహం అవ్వాల్సిందే!
వంకాయ అనగానే చాలామంది పెదవి విరుస్తుంటారు. ఎప్పుడూ ఒకేలా సాంబార్ లో వేయడమో లేదా నూనెలో వేయించడమో చేస్తుండటం వల్ల ఆ రుచికి బోర్ కొట్టి ఉండొచ్చు. మీ ఇంట్లో కూడా వంకాయ అంటే ఆమడ దూరం పారిపోయేవాళ్లు ఉన్నారా? అయితే వారికి ఒక్కసారి అయ్యంగార్ స్టైల్ బేక్డ్ వంకాయ కూర చేసి పెట్టండి.
అయ్యంగార్ల వంటకాలకు ఉండే ప్రత్యేకమైన కమ్మదనం ఈ కూరలో పుష్కలంగా ఉంటుంది. బేక్డ్ వంకాయ తయారు చేయడం ఎంత సులభమో, రుచి అంత అద్భుతంగా ఉంటుంది. అన్నం, రోటీ.. దేనిలోకైనా ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్.

బేక్డ్ వంకాయ కూర తయారీకి కావలసిన పదార్థాలు
పెద్ద వంకాయ - 1
సాంబార్ ఉల్లిపాయలు- కొద్దిగా
టమాటో - 1
నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు - 5
ఎండు మిరపకాయ - 1
పచ్చి మిరపకాయలు - 2
కరివేపాకు - 2 రెమ్మలు
ఆవాలు - అర టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
చింతపండు - చిన్న నిమ్మకాయంత
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు - కొద్దిగా
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
Sorakaya Payasam Recipe: పైదరాబాదీ వెడ్డింగ్ స్టైల్ సొరకాయ పాయసం..రుచిలో లేదు దీనికి సాటి..
బేక్డ్ వంకాయ తయారీ విధానం
-ముందుగా పెద్ద వంకాయను తీసుకుని కత్తితో అక్కడక్కడా నాలుగు, ఐదు గాట్లు పెట్టండి. ఇప్పుడు దీనిని ఓవెన్ లో లేదా నేరుగా స్టవ్ మీద (గ్రిల్ పెట్టి) కాల్చుకోవాలి. వంకాయ లోపల అంతా మెత్తగా ఉడికి, పై తొక్క నల్లగా మాడి ముడతలు పడేంతవరకు బాగా కాల్చుకోవాలి. ఇది చల్లారాక, పై తొక్కను పూర్తిగా తీసేసి లోపలి మెత్తటి గుజ్జును కత్తితో చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నువ్వుల నూనె వేడి చేయండి. నూనె కాగాక ఆవాలు వేయాలి. అవి చిటపటలాడాక మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించాలి. మినపప్పు దోరగా వేగాక కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి ముక్కలు, చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి.
-ఉల్లిపాయలు పసిడి రంగులోకి మారగానే, తరిగిన టమాటో ముక్కలు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. టమాటోలు బాగా మగ్గి, అంచుల నుండి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న వంకాయ గుజ్జును వేసి బాగా కలపాలి. కొద్దిగా నీళ్లు పోసి, మూతపెట్టి ఓ ఐదు నిమిషాల పాటు సన్నటి మంటపై మగ్గనివ్వాలి. ః
-వంకాయ బాగా మెత్తబడ్డాక, చింతపండు రసం పోసి కూరను దగ్గర పడేలా ఉడికించాలి.
-చింతపండు పచ్చివాసన పోయి కూర చిక్కబడ్డాక స్టవ్ ఆపేయండి. కూర వేడిగా ఉన్నప్పుడే పప్పుగుత్తితో లేదా గరిటతో మెత్తగా మాష్ చేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే గుమగుమలాడే వంకాయ కర్రీ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications
