Latest Updates
-
మైసూర్ స్టైల్ రసం రెసిపీ.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే గ్లాసులోనే లాగించేస్తారు.! -
రోజూ ఈ టైంలో నిద్రపోయే అలవాటుందా.. లక్ష్మీదేవి నిలవాలంటే ఈ పొరపాట్లు అస్సలు వద్దు.! -
బ్రిటిష్ కాలం నాటి కోల్క్తా ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్ పనీర్ కతీ రోల్.. ఇంట్లోనే ఈజీగా.! -
హెల్తీ కదా అని డ్రై ఫ్రూట్స్ ఇష్టారీతిన తింటున్నారా.. ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా.? -
ఎముకల పటుత్వాన్ని పెంచే గోంగూర నల్లి బొక్కల మటన్ కూర.. రాగి ముద్దతో సూపర్ కాంబో.! -
Sunday Recipe: చికెన్ ముక్క.. మసాలా చిక్క..ఆహా అనిపించే పంజాబ్ స్టైల్ చికెన్ గ్రేవీ -
గ్యాస్ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టే హెల్తీ టమాటా పొంగల్.. బ్రేక్‌ఫాస్ట్‌లో తప్పనిసరిగా ఉండాల్సిందే.! -
మద్యపానం కొందరికి వ్యసనమైతే.. మరికొందరికి ఎందుకు కాదు.. సన్నీడియోల్ అనుభవం ఇదే.! -
సొంత రాశిలోకి శుక్ర గ్రహ సంచారం: ఈ నాలుగు రాశుల వారికి కనీవినీ ఎరుగని రీతిలో అదృష్టం -
నేపాల్ వరదల్లో చేతివాటం.. మృతదేహం నుంచి బంగారం చోరీ.. వైరల్ వీడియో.!
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే మీ బ్రేక్ ఫాస్ట్ లో ఈ క్రిస్పీ సొరకాయ దోశ ఉండాల్సిందే!
సొరకాయ పేరు వినగానే చాలామంది పెదవి విరుస్తుంటారు. ముఖ్యంగా పిల్లలైతే సొరకాయతో ఏ కూర చేసినా అన్నం తినడానికి ఆసక్తి చూపరు. కానీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఎన్నో అద్భుతమైన పోషకాలు సొరకాయలో దాగి ఉన్నాయి. సొరకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది, ఇది బరువు తగ్గడానికి, జీర్ణక్రియ సాఫీగా జరగడానికి ఎంతగానో సహాయపడుతుంది.

అయితే రుచి నచ్చక సొరకాయకు దూరంగా ఉండేవారి కోసం ఒక అద్భుతమైన వంటకం సొరకాయ దోశ. ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా లేదా సాయంత్రం స్నాక్ గా దీన్ని ఆస్వాదించవచ్చు.
సొరకాయ దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
లేత సొరకాయ తురుము - 1 కప్పు
శనగపిండి - 4 టేబుల్ స్పూన్లు
బొంబాయి రవ్వ - 2 టేబుల్ స్పూన్లు
తాజా పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర తరుగు - 1 టేబుల్ స్పూన్
చాట్ మసాలా - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - కాల్చుకోవడానికి తగినంత

సొరకాయ దోశ తయారీ విధానం
-ముందుగా ఒక లేత సొరకాయను తీసుకుని పై తొక్క తీసి, శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత దాన్ని సన్నగా తురుముకోవాలి. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, తురిమిన తర్వాత అందులోని నీటిని చేత్తో తేలికగా పిండి, ఆ తురుమును ఒక గిన్నెలో పక్కన పెట్టుకోండి.
-ఇప్పుడు ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని, అందులో 4 చెంచాల శనగపిండి, 2 చెంచాల బొంబాయి రవ్వ వేయండి. ఈ పిండి మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసి పక్కన పెట్టుకున్న తురిమిన సొరకాయను కూడా వేసి బాగా కలపండి. తర్వాత ఇందులోనే 2 చెంచాల పెరుగు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీరు పోస్తూ, ఎక్కడా ఉండలు కట్టకుండా గరిటెతో నిరంతరం కలుపుతూ ఉండాలి.
-దోశ పోసుకోవడానికి వీలుగా పిండి మిశ్రమం కాస్త చిక్కగా, దోశ పిండి లాగా ఉండేలా చూసుకోండి. పిండి మరీ పలుచగా ఉండకూడదు. ఇలా సిద్ధమైన పిండిపై ఒక మూత పెట్టి, సుమారు 10 నిమిషాల పాటు పక్కన ఉంచండి. దీనివల్ల రవ్వ బాగా నానుతుంది.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి, నాన్ స్టిక్ పాన్ లేదా పెనం పెట్టి మీడియం మంట మీద వేడి చేయండి. పెనం వేడెక్కాక కొద్దిగా నూనె వేసి అంతటా రాయండి. తర్వాత గరిటెతో పిండిని తీసుకుని పెనం మీద దోశలా వృత్తాకారంలో సమానంగా పరచండి.
-దోశ అంచుల చుట్టూ, అలాగే పైన కొద్దిగా నూనె వేయండి. ఒక వైపు బాగా కాలి, రంగు మారిన తర్వాత గరిటెతో నెమ్మదిగా రెండో వైపుకు తిప్పండి. రెండు వైపులా మంచి బంగారు రంగు వచ్చి, కరకరలాడే వరకు కాల్చుకోవాలి.
-అంతే గుమగుమలాడే వేడి వేడి సొరకాయ దోశ రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications