Latest Updates
-
ఎగ్ ఇడ్లీ ఎప్పుడైనా తిన్నారా? ఈ అద్భుతమైన రుచికి మీరే ఫిదా అవుతారు! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు! -
విటమిన్లు, మినరల్స్ పుష్కలం..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ పచ్చి కూరగాయల దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది నాడు తప్పక చేయాల్సిన 5 పనులు..పచ్చడి తింటూ చదవాల్సిన శ్లోకం..ధర్మసింధు ఏం చెబుతోంది? -
ఉగాది 2026-27 రాశి ఫలాలు..పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశికి రాజయోగం? ఏ రాశికి అవమానం? -
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. నవరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం దోశ..ఎలా చేసుకోవాలంటే -
నోరూరించే హైదరాబాదీ పనీర్ కీమా.. చపాతీ, రోటీ,పూరీల్లోకి దీన్ని మించిన రుచి లేదు! -
ఈరోజు రాశి ఫలాలు (18.03.26): మీన రాశిలో చంద్రుడి సంచారం.. ఈ రాశుల వారికి ధనలాభం! -
పిండి రుబ్బే పనిలేదు..అప్పటికప్పుడు ఐరన్, కాల్షియం నిండిన దూదిలాంటి మెత్తని రాగి ఇడ్లీ ..కొబ్బరి చట్నీతో కేక!
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే!
తెలుగు వారి తొలి పండుగ ఉగాది రాగానే ప్రకృతిలో ఎన్నో మార్పులు కనిపిస్తాయి. చెట్లు చిగురిస్తాయి, కోయిలలు కిలకిలరావాలు చేస్తాయి, మల్లెల సువాసనలు వెదజల్లుతాయి, అన్నింటికీ మించి మామిడికాయలు నోరూరిస్తుంటాయి. ఉగాది పచ్చడికి ఎంత ప్రాధాన్యత ఉందో, ఉగాది పండుగ రోజు మధ్యాహ్నం భోజనంలో మామిడికాయ పప్పుకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది.
కారం పొడి వేయకుండా, కేవలం పచ్చిమిర్చి కారంతో, పుల్లటి మామిడికాయ, కమ్మటి కందిపప్పుతో చేసే ఈ మామిడికాయ పచ్చిమిర్చి పప్పు రుచి అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ఈ పప్పు, కాస్త నెయ్యి, వడియాలు నంచుకుని తింటే ఆ మజాయే వేరు.
మామిడికాయ పచ్చిమిర్చి పప్పు తయారీ విధానం
కందిపప్పు - 1 కప్పు
పుల్లటి పచ్చి మామిడికాయ - 1
పచ్చిమిర్చి - 10
ఉల్లిపాయ - 1
పసుపు - అర టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - 3 కప్పులు
నూనె లేదా నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ఎండుమిర్చి - 3
వెల్లుల్లి రెబ్బలు - 5
కరివేపాకు - 2 రెమ్మలు
ఇంగువ - చిటికెడు
మామిడికాయ పచ్చిమిర్చి పప్పు తయారీ విధానం
-ముందుగా ఒక కప్పు కందిపప్పును తీసుకుని రెండు సార్లు శుభ్రంగా నీటితో కడగాలి. ఆ తర్వాత అందులో తగినన్ని నీళ్లు పోసి సుమారు 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి.
-తర్వాత పచ్చి మామిడికాయను శుభ్రంగా కడిగి, పైన ఉన్న చెక్కు తీసేయాలి. లోపల ఉన్న టెంకను తీసేసి, మామిడికాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
-ఉల్లిపాయను పెద్ద ముక్కలుగా, పచ్చిమిర్చిని పొడవుగా చీలికలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
-ఇప్పుడు నానబెట్టిన కందిపప్పులో ఉన్న నీటిని వంపేసి, పప్పును ప్రెషర్ కుక్కర్ లో వేయాలి. ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, అర టీస్పూన్ పసుపు, సుమారు 2.5 నుండి 3 కప్పుల నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మీడియం మంట మీద 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆపేయాలి.
-కుక్కర్లోని ఆవిరి (ప్రెషర్) పూర్తిగా పోయే వరకు ఆగాలి. ఆవిరి పోయాక మూత తీసి, రుచికి సరిపడా ఉప్పు వేసి పప్పుగుత్తితో మెత్తగా ఎనపాలి. మామిడికాయ ముక్కలు అక్కడక్కడా తగులుతూ ఉంటే ఇష్టపడేవారు మరీ మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా ఎనుపుకోవచ్చు. పప్పు మరీ గట్టిగా ఉంటే కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు.
-ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నూనె లేదా నెయ్యి వేడి చేసి ఆవాలు, జీలకర్ర,దంచిన వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. చివరగా చిటికెడు ఇంగువ వేసి స్టవ్ ఆపేయాలి.
-సిద్ధం చేసుకున్న ఈ తాలింపును ఉడికించి పెట్టుకున్న మామిడికాయ పప్పులో వేసి బాగా కలుపుకోవాలి. అంతే ఎంతో కమ్మనైన మామిడికాయ పచ్చిమిర్చి పప్పు రెడీ.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications

