Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
విటమిన్లు, మినరల్స్ పుష్కలం..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ పచ్చి కూరగాయల దోశ..ఎలా చేసుకోవాలంటే..
ఉదయం బ్రేక్ ఫాస్ట్ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది దోశ. అయితే ఎప్పుడూ ఒకే రకమైన ప్లెయిన్ దోశ, మసాలా దోశ తిని బోర్ కొట్టిందా? అయితే పచ్చి కూరగాయల దోశ ట్రై చేయండి. ఇది రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఒక అద్భుతమైన సూపర్ ఫుడ్ లాగా పనిచేస్తుంది. ఈ పచ్చి కూరగాయల దోశను కేవలం 10-15 నిమిషాల్లో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు.
పచ్చి కూరగాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. కేవలం పిండితో వేసిన దోశను తినడం కంటే, ఇలా రకరకాల పచ్చి కూరగాయలను జోడించి చేసిన దోశను తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. కూరగాయలు తినడానికి మారాం చేసే పిల్లలకు ఇలా దోశలో కలిపి పెడితే ఏమాత్రం వదలకుండా ఇష్టంగా లాగించేస్తారు.

పచ్చి కూరగాయల దోశ తయారీకి కావాల్సిన పదార్థాలు
దోశ పిండి - రెండు కప్పులు
క్యారెట్ తురుము - పావు కప్పు
క్యాప్సికమ్ ముక్కలు - పావు కప్పు
క్యాబేజీ తరుగు - పావు కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
పచ్చిమిర్చి - 2
కొత్తిమీర - సగం కట్ట
నూనె - దోశలు కాల్చుకోవడాని
ఉప్పు - రుచికి సరిపడా
పచ్చి కూరగాయల దోశ తయారీ విధానం
-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో రెండు కప్పుల దోశ పిండిని వేసుకోవాలి.
-ఇప్పుడు ఆ పిండిలో మనం ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము, క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ తరుగు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర ఆకులను వేయాలి. ఇవన్నీ పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా అన్నీ కలుపుకున్న మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి.
-ఇప్పుడు స్టవ్ వెలిగించి దానిపై దోశల పెనం పెట్టుకోవాలి. పెనం బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నూనె వేయాలి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న కూరగాయల దోశ పిండిని ఒక గరిటెడు తీసుకుని పెనం పైన పోసి, మెల్లగా పలుచగా దోశలాగా వలయాకారంలో స్ప్రెడ్ చేసుకోవాలి.
-దోశ చుట్టూ కొద్దిగా నూనె వేసి కాల్చుకోవాలి. ఒకవైపు ఎర్రగా కాలిన తర్వాత, మెల్లగా దోశను రెండో వైపుకు తిప్పుకుని, అటువైపు కూడా బాగా కాలనివ్వాలి. దోశ రెండు వైపులా చక్కగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
-అంతే ఎంతో రుచికరమైన, ఆరోగ్యకరమైన వేడివేడి పచ్చి కూరగాయల దోశ రెడీ. ఈ దోశను ఉల్లి-కారం లేదా ఎర్ర చట్నీ కాంబినేషన్ తో తింటే ఆ రుచే వేరు.. టేస్ట్ అదిరిపోతుంది.
Boldsky బ్రేకింగ్ న్యూస్ అలర్ట్స్ కోసం | Subscribe to Telugu Boldsky.



Click it and Unblock the Notifications