Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
ఆమ్ కి చట్నీ( గ్రీన్ మ్యాంగో/పచ్చిమామిడికాయ) చట్నీ
వేసవికాలం వచ్చిందంటే చాలు.. లేలేత మామిడికాయల వగరు.. పులుపు నోరూరిస్తాయి. మామిడికాయ తో చేసిన వంటకాలు ఎంతో రుచిగా ఉంటాయి.ఈ కాలంలో మాత్రమే లభించే మామిడికాయతో చేసే ఎన్నో వంటకాలు భానుడితాపాన్ని సైతం భరించేలా చల్లదనానిస్తాయి.
లేత మామిడితొక్కు.. చిన్నచిన్న ముక్కల పచ్చడి, కొబ్బరితో కలిపి పచ్చడి, మామిడి కాయ పప్పు, మామిడి కాయ చారు, మామిడి కాయ షర్భత్, పులిహార ఇలా ఎన్నో వె రైటీలకు మామిడికాయ పెట్టింది పేరు. ఆంధ్ర వారు చేసుకునే తెలుగు వంటలులోని రుచికరమైన వంటకం మామిడికాయ పచ్చడి కూడా ఒకటి మరి దీన్ని ఎలా తయారుచేద్దామో తెలుసుకుందాం...

కావల్సిన పదార్థాలు:
పచ్చిమామిడికాయ: 1
కారం: 1tsp
మెంతులు లేదా మెంతి పొడి: చిటికెడు
జీలకర్ర: చిటికెడు
ఆవాలు: చిటికెడు
బిర్యానీ ఆకు: 1
పసుపు: 1tsp
పంచదార: 1-2tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1tsp
నీళ్ళు : కొద్దిగా
తయారుచేయు విధానం:
1. పచ్చిమామిడికాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి . మామిడికాయ మీద తొక్కను తొలగించి, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి.
2. తర్వాత ప్రెజర్ కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. అందులో బిర్యానీ ఆకు, మెంతులు, జీలకర్ర మరియు ఆవాలు వేసి ఒక నిముషం ఫ్రై చేసుకోవాలి.
3. ఇప్పుడు అందులో మామిడికాయ ముక్కలు లేదా మామిడి తురుము వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేయాలి.
4. తర్వాత అందులో పంచదార, పసుపు, కారం కూడా వేసి మొత్తం మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి.
5. తర్వాత అందులో నీళ్ళు పోసి బాగా మిక్స్ చేసి, మూత పెట్టి, ఒక విజిల్ వచ్చే వరకూ ఉడికించుకోవాలి.
6. ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి మూత తీసి గరిటితో మామిడికాయ మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి అంతే ఆమ్ కి చట్నీ రెడీ.
7. ఇది పప్పుకు సైడ్ డిష్ గా వండిస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ చట్నీని ఒక వారంలో రోజుల పాటు ఫ్రిజ్ లో నిల్వచేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications