Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
బీట్ రూట్ పనీర్ పులావ్ : హెల్తీ అండ్ టేస్టీ
రెడ్ బ్లడ్ బీట్ రూట్ కి ఇది ఒక మంచి సీజన్. బీట్ రూట్ ను చాలా తక్కువగా వినియోగిస్తారు. కారణం దాని ఆకారం, రంగు రుచి. అయితే, బీట్ రూట్ అనేక ఆరోగ్యప్రయోజనాలను కలిగినటువంటి హెల్తీ వెజిటేబుల్ ఇది. శక్తినిచ్చే శాకాహారదుంపల్లో బీట్‌రూట్‌ది మొదటి స్థానం.. దీని వల్ల చాలా లాభాలు ఉన్నాయి. బీట్ రూట్ లో నైట్రేట్‌ల నిల్వలు అధికం. ఇవి నైట్రేట్ ఆక్సైడ్ లుగా మారి రక్తప్రసరణ వేగాన్ని పెంచుతాయి. ఫలితంగా రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తాయి.
బీట్ రూట్ తో వివిధ రాకాల వంటలు వండుతారు. ముఖ్యంగా బీట్ రూట్ తో చేసే హల్వా చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే బీట్ రూట్ కర్రీ, వేపుడు వంటివి మంచి టేస్ట్ ఉంటుంది. ఇది రంగు రుచి మాత్రమే కాదు ఆరోగ్యపరంగాను బాగా సహాయపడుతుంది. బీట్ రూట్ లో అత్యధిక పోషవిలువలు ఉన్నాయి. ఎవరైనా రక్తహీనతతో బాధపడుతుంటే బీట్ రూట్ తినమని సలహా ఇచ్చేస్తుంటారు. ఆరోగ్యం పట్ల బాగా శ్రద్ధవున్నవారు రెండుబీట్ రూట్ తినడానికి ఇష్టపడుతారు.
ట్రెడిషినల్ మెడిసిన్ బీట్ రూట్ జ్యూస్ లోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు...
అయితే బీట్ రూట్ తినడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. నిజానికి బీట్ రూట్ ను, జ్యూసులు, సలాడ్, వేపుడు రూపంలోనే కాకుండా బోలెడు వెరైటీలుగా వండుకుని తినొచ్చు. పూరీలు మొదలు వడలు వరకూ వివిధ రకాల వంటలు తయారు చేసుకొని తినవచ్చు. మరి బీట్ రూట్ వెరైటీగా పన్నీర్ తురుము చేర్చి, పులావ్ రిసిపిని ఎలా తయారుచేస్తారో తెలుసుకుందాం...

బియ్యం: 2 cups
బీట్ రూట్ - 1 (grated)
పన్నీర్ - 100gms
నెయ్యి - 3 tbsp
మిరియాలు - 1 tbsp
ఉల్లిపాయలు- 1 (chopped)
జీడిపప్పు - 200 gms (chopped)
ఎండుద్రాక్ష - 1 cup
కారం- 1 tbsp
గరం మసాలా - ½ tbsp
పుదీనా - ½ cup(chopped)
కొత్తిమీర : కొద్దిగా
ఉప్పు రుచికి సరిపడా
ఆశ్చర్యం కలిగించే బీట్ రూట్ చర్మ సౌందర్య రహస్యాలు
తయారుచేయు విధానం:
1. ముందుగా పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి కాగిన తర్వాత అందులో మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిముషాలు వేగించాలి.
2. తర్వాత అందులోనే జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి ఒక నిముషం వేగనివ్వాలి.
3. ఇప్పుడు అందులోనే బీటర్ రూట్ తురుము, పనీర్ తురుము మరియు పచ్చిమిర్చి తరుగు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ ప్రై చేసుకోవాలి.
బీట్ రూట్-కోకోనట్ ఫ్రై: స్పెషల్ సైడ్ డిష్
4. బీట్ రూట్, పనీర్ మెత్తబడ్డాక, అందులో గరం మసాలా, పుదీనా, ఉప్పు వేసి మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేయాలి.
5. మసాలా పచ్చివాసన పోయే వరకూ ఫ్రై చేసి అందులో కడిగిపెట్టుకొన్న బియ్యాన్ని వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపుకోవాలి.
6. ఇప్పుడు ఈ మిశ్రమంలో మూడు కప్పుల నీరు పోసి మొత్తం మిక్స్ చేసి, 2విజిల్స్ వచ్చేవరకూ ఉడికించుకోవాలి.
7. విజిల్స్ వచ్చిన తర్వాత క్రిందికి దింపుకొని, కుక్కర్లో ఆవిరి మొత్తం తగ్గిన తర్వాత కొత్తిమీర చల్లి తర్వాత సర్వ్ చేయాలి.అంతే పనీర్ అండ్ బీట్ రూట్ పులావ్ రెడీ . గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications