Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
రుచికరమై బేసన్ దోస : హెల్తీ బ్రేక్ ఫాస్ట్
మీరు హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తో మీ దినచర్యను ప్రారంభించాలని కోరుకుంటున్నారా? అయితే ఈరోజు మీకోసం ఒక హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ను పరిచయం చేస్తున్నాం. అది బేసన్ దోసె రిసిపి. ఈ వెజిటేరియన్ రిసిపి తయారుచేయడానికి కొద్దిగా సమయం పట్టినా దీన్ని తయారుచేసుకోవడం రుచిగా మరియు హెల్తీ కూడా .
పనిచేసే ఉద్యోగినులకు ఇది ఒక హెల్త్ ఫుల్ ఫిల్లింగ్ బ్రేక్ ఫాస్ట్ . పిల్లలకు కూడా చాలా ఆరోగ్యకరమైనటువంటి టిఫిన్ గా అందివ్వొచ్చు. దీన్ని తినడం వల్ల త్వరగా ఆకలి అనిపించదు కాబట్టి, బరువు తగ్గాలనుకొనే వారు కూడా దీన్ని తీసుకోవచ్చు. ఈ పిండిని తయారుచేసేప్పుడు, పిండి మరీ చిక్కగా లేకుండా చూసుకోవాలి. చిక్కగా ఉండే దోసె ఉండలు కడుతుంది. కాబట్టి, పిండిని సాధ్యమైనంత పల్చగా వేసుకోవాలి. మరి దీన్ని ఎలా తయారుచేయాలి, దీనికి కావల్సిన పదార్థాలేంటో ఒకసారి చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
బియ్యం: 4 cup(5గంటలు నానబెట్టుకోవాలి)
ఉద్ది పప్పు: 1cup(5గంటలు నానబెట్టుకోవాలి)
శెనగపప్పు: 1cup
కొద్దిగా అటుకులు
మెంతులు: 1tsp
పంచదార: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
బేకింగ్ సోడ: చిటికెడు
మసాలా కోసం :
బంగాళదుంప: 2(ఉడికించి, పొట్టు తీసి, మ్యాష్ చేసినవి)
ఉల్లిపాయలు: 2 (సన్నగా తరిగి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా
చట్నీకోసం:
కొబ్బరి తురుము: 1CUP
పచ్చిమిర్చి: 4
పంచదారం1
అల్లం : చిన్న ముక్క
కొత్తిమీర తరుగు
పోపుదినుసులు ఫ్రై చేసుకొన్నవి: 3tsp
ఇంగువ: చిటికెడు
నూనె: 1tsp
ఆవాలు: 1tsp
ఉప్పు రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా దోసకోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్ని గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ పిండిని ఒక రాత్రి అలాగే పెట్టడం వల్ల దోసపిండి పులిసి దోసెలు మెత్తగా వస్తాయి.
2. తర్వత మరుసటి రోజు ఉదయం దోస పాన్ స్టౌ మీద పెట్టి, దోసె పిండిని వేసి పల్చగా దోసె వేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకూ నెయ్యితో ఫ్రైచేసుకోవాలి.
3. ఇప్పుడు మసాలా కోసం సిద్దం చేసుకొన్న పదార్థాలన్ని దోస మీద వేసి స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదా సెంటర్లో పెట్టి రోల్ చేసి అందివ్వొచ్చు.
5. ఇప్పుడు చట్నీ కోసం సిద్దం చేసుకొన్న వాటిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా చేసుకోవాలి. అంతే చట్నీ రెడీ.
5. ఇప్పుడు నెయ్యితో రోస్ట్ చేసి ఉల్లిపాయలు, టేస్టీ చట్నీతో బేసన్ దోసను బ్రేక్ ఫాస్ట్ గా సర్వ్ చేయడమే....



Click it and Unblock the Notifications