Latest Updates
-
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే!
కార్న్ అండ్ చీజ్ బాల్స్-స్పెషల్ బ్రేక్ ఫాస్ట్
వారం మొత్తంలో ప్రతి రోజూ ఏదో ఒక బ్రేక్ ఫాస్ట్ చేసినవే చేస్తూ తినేస్తుంటాం. కానీ వారంతంలో మాత్రం కొంత సమయం ఉంటుంది కాబట్టి, కాస్త వెరైటీగా ఉండాలని కోరుకుంటాం. అటువంటప్పుడు, ఇటువంటి బ్రేక్ ఫాస్ట్ తయారు చేసుకోవడం చాలా వెరైటీగా, టేస్టీగా వారంతంలో టేస్ట్ చేయవచ్చు. ఈ బ్రేక్ ఫాస్ట్ చాలా వెరైటీగా మరియు టేస్టీగా ఉంటాయి.
ఈ స్పెషల్ కార్న్ చీజ్ బాల్స్ రిసిపి ఇక్కడ ఉండి. ఇది ఇంట్లో పిల్లలతో పాటు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి మీరు కూడా ఒక సారి ట్రై చేసి ఫ్యామీలి మెంబర్స్ కు కొత్త టేస్ట్ తో సర్పైజ్ చేయండి..

కావల్సిన పదార్థాలు:
కార్న్(మొక్కజొన్న): 1cup(తాజావి లేదా ఎండువి)
పనీర్ / ఇండియన్ కాటేజ్ చీజ్: 100gm(పనీర్ అందుబాటులో లేకపోతే, మీరు ఉడికించిన పొటాటోను ఉపయోగించవచ్చు)
చెడ్దర్ చీజ్: 3/4cup
మొక్కజొన్న పిండి: 2tbsp
మైదాపిండి: 1/4cup
ఉప్పు: రుచికి సరిపడా
చక్కెర: ½tsp
పచ్చి మిర్చి: 1-2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కొత్తిమీర: 2tbsp(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
బేకింగ్ పౌడర్: ½tsp
పాలు: ¼cup
బ్రెడ్ ముక్కలు లేదా బ్రెడ్ పొడి:కొద్దిగా
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా తాజా మొక్కజొన్నగింజల్లో కొన్ని నీళ్ళు పోసి మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి.
2. తర్వాత నీరు వంపేసి, మిక్సీలో వేసి రఫ్ గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పన్నీర్ లేదా పొటాటోను తురిమి పెట్టుకోవాలి.
4. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకొన్న కార్న్, పన్నీర్, చీజ్, కార్న్ ఫ్లోర్, పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగు, మరియు బేకింగ్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
5. ఈ మిశ్రమాన్ని బాగా మెత్తగా, సున్నితంగా కలుపుకొని 13-15బాల్స్ ను మీడియం సైజ్ లో గుండ్రంగా చుట్టుకోవాలి. ఈ ఉండల్ని రిఫ్రిజరేటర్ లో 10-15నిముషాలు పెట్టాలి.
6. 15నిముషాల తర్వాత వీటిని బయటకు తీసి, వాటిని పాలలో డిప్ చేసి, బ్రెడ్ పొడిలో దొర్లించి, 10-15నిముషాలు తిరిగి ఫ్రిజ్ లో పెట్టాలి.
7. ఇప్పుడు ఫ్రిజ్ లోని బాల్స్ బయటకు తీసుకొని, రెండు మూడు నిముషాల తర్వాత స్టౌమీద పాన్ పెట్టి, నూనె పోసి, బాగా కాగిన తర్వాత, మంటను మీడియంగా తగ్గించి
అందులో ఫ్రిజ్ లో నుండి తీసిన బాల్ ను వేసి డీప్ ఫ్రై చేయాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి.
8. నూనె మరీ వేడిగా లేకుండా జాగ్రత్తపడాలి. లేదంటా కార్న్ బాల్స్ నల్లగా మారిపోతాయి. వీటిని సర్వింగ్ ప్లేట్ లోనికి తీసుకొని టమోటో కెచప్ తో వేడి వేడిగా సర్వ్ చేయాలి.



Click it and Unblock the Notifications