Latest Updates
-
కన్యా రాశిలో చంద్రుడి సంచారం: ఈ పనులు చేస్తే మీ ఆర్థిక కష్టాలు మటుమాయం! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుత అవకాశాలు.. మీ రాశి ఉందా? - మంగళవారం, 28 ఏప్రిల్ 2026 -
ఎండల దెబ్బకు పీసీఓఎస్, పీరియడ్స్ సమస్యలు పెరుగుతున్నాయా? ఈ జాగ్రత్తలు మీకోసమే! -
ఎండల మంటల్లో పెళ్లిళ్లు.. వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే ఈ మార్పులు తప్పనిసరి! -
జేబులో ఉల్లిపాయ పెట్టుకుంటే వడదెబ్బ తగలదా? -
సూరత్‌లో దారుణం: భార్యను సిమెంట్ బాక్సులో దాచిన భర్త.. బంధాల్లో ఈ 'రెడ్ ఫ్లాగ్స్' కనిపిస్తే జాగ్రత్త! -
షుగర్ ఫ్రీ పుదీనా లస్సీ.. వేసవిలో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం! -
వేసవి తాపాన్ని తగ్గించే సత్తు లడ్డూ.. ఈ ఎండలకు బెస్ట్ స్వీట్ ఇదే! -
NEET UG 2026 అడ్మిట్ కార్డులు వచ్చేసాయి.. పరీక్షలో విజయం సాధించాలంటే ఈ చివరి నిమిషం జాగ్రత్తలు తప్పనిసరి! -
పాలు వద్దు, పంచదార వద్దు.. పటిక బెల్లంతో 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ రవ్వ లడ్డు!
క్రిస్పీ అండ్ టేస్టీ బేబీ పొటాటో రిసిపి
బేబి పొటాటో ఈ సీజన్ లో ఎక్కువగా దొరుకుతాయి. ఈ సీజన్ లో దొరికే బేబీ పొటాటాలను మన ఇండియన్ డిష్ లలో అనేక వాటిలో ఉపయోగిస్తుంటారు . ఈ సీజన్ లో ఎక్కువ పండ్లు, వెజిటేబుల్స్ మనకు అందుబాటులో ఉంటాయి. బేబీ పొటాటోలు, సాధారన బంగాళదుంపల కంటే రుచి డిఫరెంట్ గా ఉంటుంది . కాబట్టి, మీ మెనులో దీన్ని చేర్చుకోండి.
బేబీ పొటాటోలను ఉపయోగించి అనేక వంటలను తయారుచేవచ్చు. ఈ పొటాటోలను ఫ్రై చేయడం లేదా రుచికరమైన చిక్కటి గ్రేవీలా తయారుచేసుకోవాలి. ముఖ్యంగా బేబీ పొటాటోలను పొట్టు తీయకుండా వండటం వల్ల ఆరోగ్యానికి చాలా మంది. మరి ఈ చిన్న పొటాటోలను క్రిస్పిగా మరియు స్పైసీగా ప్రై చేస్తే మరింత రుచికరంగా ఉంటుంది . మరి వీటిని ఉపయోగించి అతి త్వరగా తయారుచేసే ఒక పొటాటో రిసిపి మీకోసం ....
కావల్సిన పదార్థాలు:
బేబీ పొటాటో : 8-10
పచ్చిమిర్చి: 2-3(మద్యకు కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు:
టమోటో: 1
పసుపు: 1tsp
కారం: 1tsp
కొత్తమీర: 1tsp
గరం మసాలా: చిటికెడు
జీకలర్ర: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత

తయారుచేయు విధానం:
1. ముందుగా బేబీ పొటాటను శుభ్రంగా కడిగాలి. ఈ చిన్న చిన్న బేబీ పొటాటోలకు మట్టి బాగా అంటుకొని ఉంటుంది. కాబట్టి, రన్నింగ్ వాటర్ లో శుభ్రం చేయడం చాలా ముఖ్యం.
2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ లో నూనె వేసి, వేడయ్యాక అందులో నిదానంగా బేబిపొటాటోలను ఒక దాని తర్వాత ఒకటి వేయాలి. బేబీ పొటాటోలో నీరు లేకుండా జాగ్రత్తపడాలి.
3. మీడియం మంట మీద 5నిముషాలు బాగా వేగించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేగించుకోవాలి .
4. అంతలోపు, ఉల్లిపాయలను మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే టమోటోలను కూడా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు బంగాళదుంపలు బ్రౌన్ కలర్ లో మారి వేగిన వెంటనే వీటిని నూనె నుండి వేరు చేసి, ప్లేట్ లో తీసి పక్కన పెట్టుకోవాలి.
6. అదే పాన్ లో జీలకర్ర, ఆవాలు వేసి , చిటపటలాడిన తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి మరో 5-6నిముషాలు వేగించుకోవాలి అలాగే అందులో పసుపు మరియు ఉప్పు కూడా చేర్చుకోవాలి.
7. రెండు నిముషాలు ఫ్ర ముక్కలు కూడా వేసి 5 నిముషాలు క్రిస్పీగా వేగించుకోవాలి. ఇప్పుడు అందులో టమోటో పేస్ట్ కూడా వేసి మరో 2-3నిముషాలు వేగించుకోవాలి.
8. మిశ్రమాన్నంతటిని బాగా వేగిస్తూనే అందులో కారం, ధనియాల పొడి మరియు గరం మాసాలా వేసి బాగా వేగించుకోవాలి.
9. ఫ్రైచేస్తున్న పదార్థాలన్నీ బాగా వేగించిచాలి. మంచి సువాసన వచ్చే సమయంలో అందులో ముందుగా వేగించి పెట్టుకొన్న బేబీ పొటాటోను వేయాలి. ఫ్రైయింగ్ మిశ్రమంతో బేబి పొటాటో బాగా మిక్స్ అయ్యేంత వరకూ తక్కువ మంట మీద మరికొద్దిసేపు వేగించుకొని స్టౌ ఆఫ్ చేసేయాలి. అంతే బేబీ పొటాటో ఫ్రై రెడీ. వీటి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.



Click it and Unblock the Notifications