Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
కీరదోస సలాడ్-సమ్మర్ స్పెషల్
కీరదోసకాయకు ఆకట్టుకునే రూపం లేదు. దీని రుచియేమో చిరు చేదు. అయినా కూడా ఇష్టంగానో, కష్టంగానో తింటూనే ఉంటాం. అందుకే దాదాపుగా ప్రతి ఇంట్లో రోజు కనిపిస్తూనే ఉంటుంది. వేసవిలో అయితే మరీనూ. అదే మరి ‘కీరదోసకాయ'గొప్పదనం.
ప్రతి రోజూ మనం తినడానికి ఎన్నో రుచికరమైన పండ్లు , కూరగాయలు ఉండగా పనిగట్టుకుని మరీ అంతా కీర ముక్కలనే ఎందుకు తింటారు? ఇది ఆరోగ్యానికి చక్కని ఔషధం. సౌందర్యానికి ప్రియనేస్తం. ఊబకాయలకు బద్ధ శత్రువు. అన్నిటికీ మించి కీరకాయ.... వేసవి దాహం..తాపం తీర్చే మంచినీటి భండాగారం. ప్రధానంగా దీన్ని సలాడ్స్ లో, ఎక్కువగా ప్రపంచవ్యాప్తంగా తింటున్నారు.
కావల్సిన పదార్థాలు:
కీరదోసకాయలు : 2
టమోటో: 1
ఉల్లిపాయ: 1(అవసరమైతేనే/మీకు ఇష్టమైతేనే)
నిమ్మరసం: 1tbsp
ఛాట్ మసాలా: 1tsp
బ్లాక్ సాల్ట్: రుచికి సరిపడా

తయారు చేయు విధానం:
1. ముందుగా కీరదోసకాయను ముక్కలుగా కట్ చేసి స్లైస్(చక్రల్లా)గా కట్ చేసుకోవాలి.
2. తర్వాత టమోటో మరియు ఉల్లిపాయలను కూడా స్లైస్ లా కట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో కీరదోస, టమోటో, ఉల్లిపాయ స్లైసులు అన్నీ వేయాలి.
4. ఇప్పుడు అందులో నిమ్మరసం, ఛాట్ మసాలా మరియు బ్లాక్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేయాలి. అంతే కీరదోస సలాడ్ రెడీ. వెంటనే సర్వ్ చేయడం వల్ల గాస్ట్రిక్ సమస్యను నివారించవచ్చు. మీకు ఫర్ ఫెక్ట్ సలాడ్ కావాలనుకుంటే మీరు ఇతర కూరగాయలు(క్యారెట్, బీట్ రూట్, క్యాబేజ్ వంటివి)కూడా మిక్స్ చేసి తయారు చేసుకోవచ్చు.



Click it and Unblock the Notifications