Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
కాకరకాయ సుఖ రిసిపి: టేస్టీ అండ్ టేస్టీ
కాకరకాయ అంటేనే ఇది చాలా చేదుగా ఉంటుందని అనుకోకూడదు. చేదు లేకుండా కూడా, తయారుచేవచ్చు. కొంచెం ఓపిగ్గా తయారుచేస్తే చాలా రుచిగా ఉంటుంది. అందుకు సరైన పదార్థాలు మరియు టెక్నిక్స్ ను అనుసరిసరిస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది . చాలా వరకూ రెగ్యులర్ వెజిటేబుల్స్ కంటే బిట్టర్ గార్డ్ (కాకరకాయ) చాలా రుచికరంగా ఉంటుంది.
బిట్టర్ గార్డ్ రిసిపి చాలా సింపుల్ గా మరియు త్వరగా తయారుచేసుకోవచ్చు. ఈ రిసిపి తయారుచేయడానికి ముఖ్యమైన ట్రింక్ ఏంటంటే, ఈ రిసిపిలో కాకరకాయ నుండి చేదును తొలగించడమే . కాకరకాయను ఉప్పు మరియు ఇతర పదార్థాలను మ్యారినేట్ చేసుకొని ఒక గంట సమయం పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో పూర్తిగా చేదు తొలగిపోతుంది. ఆ తర్వాత ఇతర మసాలా దినుషులు మరియు పదార్థాలతో తయారుచేస్తే చాలా రుచికరంగా ఉంటుంది...

కావల్సిన పదార్థాలు:
కాకరకాయలు: 4 మీడియం సైజ్ (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2 పెద్దవి(సన్నగా కట్ చేసుకోవాలి)
టమోటో: 2 పెద్దవి (సన్నగా కట్ చేసుకోవాలి)
బంగాళాదుంప: 1 పెద్దది (చిన్నగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 3 (మద్యలోకి కట్ చేయాలి)
పసుపు: ¼ tsp
కారం: ¼ tsp
గరం మసాలా :¼ tsp
జీలకర్ర: ¼ tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: ½tsp
తురిమిన కొబ్బరి: 4-5tbsp
ఉప్పు: రుచికి సరిపడా
నిమ్మరసం: 2tsp
కరివేపాకు కొన్ని
ఆయిల్: 2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా కాకరకాయ ముక్కలను శుభ్రంగా కడిగి, వాటికి కొద్దిగా ఉప్పు, కారం, పసుపు, మరియు నిమ్మరసం వేసి, బాగా మిక్స్ చేసి, కాకరకాయ ముక్కలకు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి, నిమ్మరసం, ఉప్పుకారంలో కలిపి పెట్టుకొన్న కాకరకాయ ముక్కలను వేసి, క్రిస్పీగా మరియు బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకొని, పక్కన తీసి పెట్టుకోవాలి.
3. ఇప్పుడు అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి, వేడి అయ్యాక అందులో, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి పేస్ట్, మరియు ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి.
4. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లోనికి మారగానే అందులో టమోటో ముక్కలు కూడా వేసి మరో 3 నిముషాలు వేయించుకోవాలి.
5. ఇప్పుడు అందులో బంగాళదుంప ముక్కలు వేసి ఒక ఐదు నిముషాలు ఫ్రై చేసి, తర్వాత సరిపడా నీళ్ళు పోసి, మూత పెట్టి తర్వాత బంగాళదుంపలను ఉడికించుకోవాలి.
6. బంగాళదుంప మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో క్రిస్పీగా వేయించు పెట్టుకొన్న కాకరకాయ ముక్కలు, గరం మసాలా, కొబ్బరి తురుము, మరియు ఉప్పు వేసి బాగా మిక్స్ చేసి, మరో 5నిముషాలు, మీడియం మంట మీద వేయించుకోవాలి. అంతే ఈ టేస్టీ డిష్ ను గోవాన్ రైస్ అండ్ ప్రాన్ కర్రీతో తో సర్వ్ చేస్తే చాలా రుచికరంగా ఉంటుంది.



Click it and Unblock the Notifications