Latest Updates
-
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్‌లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి!
రాయలసీమ స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ - గుంతపొంగనాలు
మిగిలిన పోయిన ఇడ్లీ పిండి లేదా దోసె పిండి ఏం చేస్తారు? ఈ పిండిని వెరైటీగా బ్రేక్ ఫాస్ట్ గా తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది. చాలా రుచికరంగా , అతి త్వరగా సులభంగా తయారు చేసుకోవచ్చు. మిగిలిన పిండికి జస్ట్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ముక్కలు మరియు జీలకర్ర, కొత్తిమీర వంటివి మిక్స్ చేసి తయారు చేసుకోవాలి.
ఇది ప్రత్యేకమైన ఉదయం ఫలహారం. వీటిని చేసుకోడానికి గుంతల పెనం మార్కెట్లో దొరుకుతుంది. మూడు రకాల పొంగనాల రుచులు మీకోసం...
కావలసిన పదార్థాలు
బియ్యం: 2cups
మినప్పప్పు: 1cup
నానబెట్టిన సెనగపప్పు: 2tsp
క్యారెట్ తురుము: 2tsp
పుదీన, కొత్తిమీర: కొద్దిగా
కరివేపాకు: 2రెమ్మలు
అల్లం ముక్క: చిన్నది
పచ్చిమిర్చి: 2
జీలకర్ర: 1tsp
ఉల్లిపాయ ముక్కలు: 2cups
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. బియ్యం, మినప్పప్పు నాలుగు గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి.
2. మర్నాడు ఈ పిండిలో సెనగపప్పు, క్యారెట్ తురుము, పుదీన, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలియదిప్పాలి.
3. పొంగనాల కడాయి స్టౌ మీద పెట్టి బాగా వేడయ్యాక గుంతల్లో కొద్ది కొద్దిగా నూనె వేయాలి.
4. తర్వాత గరిటతో గుంతల్లో పిండి వేసి మూత పెట్టాలి.
5. కొద్ది సేపటి తర్వాత వాటిని రెండో వైపు తిప్పాలి. రెండు వైపులా ఉడికితే పొంగనాలు రెడీ. వీటికి కాంబినేషన్‌గా పల్లీచట్నీ, కారం పొడి, టమాట పచ్చిమిర్చి రోటి పచ్చడి... ఇలా ఏదైనా బావుంటుంది.



Click it and Unblock the Notifications
