Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం
హెల్తీ బ్రేక్ ఫాస్ట్ డ్రైఫ్రూట్ ఇడ్లీ
సౌత్ ఇండియన్ బ్రేక్ ఫాస్ట్ రిసిపిలో చాలా వెరైటీలున్నాయి. వాటిలో ముఖ్యంగా రెగ్యులర్ గా తయారు చేసుకొనే బ్రేక్ ఫాస్ట్ రిసిపిలు, ఇడ్లీ, దోసె, ఉప్మా, పొంగల్, రైస్ ఐటమ్స్ లో కొన్ని. వీటిల్లో ఇడ్లీ చాలా పాపులర్ వంటకం. చాలా త్వరగా తయారయ్యే వంటకం. ఇడ్లీ సాంబార్, చట్నీ రుచి మాత్రమే కాదు. హెల్తీ మరియు కడుపు ఫుల్ గా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది.
రెగ్యులర్ గా తయారు చేసుకొని ఇడ్లీ తినితిని బోరుకొడుతుంటే కొంచెం వెరైటీగా ట్రై చేయండి. డ్రైఫ్రూట్స్ ఉపయోగించి ఇడ్లీని తయారు చేయడం వల్ల ఇది రుచితో పాటు హెల్తీ బ్రేక్ ఫాస్ట్. ఈ ఇడ్లీలకు నూనెను ఉయోగించము కాబట్టి లో క్యాలరీ బ్రేక్ ఫాస్ట్ గా ఇది బాగా పాపులర్. డ్రై ఫ్రూట్స్ లోని పూర్తి పోషకాశాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో అంధించడం వల్ల ఆ రోజుకు సరిపడా శక్తిని అంధిస్తుంది. వీటిని పిల్లలు మాత్రమే కాదు పెద్దలు కూడా బాగా ఇష్టపడుతారు. మరికెందుకు ఆలస్యం డ్రై ఫ్రూట్స్ ఇడ్లీని మీరూ ట్రై చేయండి. ఇంటిల్లిపాది ఆరోగ్యాన్ని పొందండి..
కావలసిన పదార్థాలు:ఖర్జూరాలు: 6 (చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి)
జీడిపప్పులు: 20 (చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి)
కిస్‌మిస్: 20 (చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి)
బాదం పలుకులు: 10 (చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి)
ఇడ్లీపిండి: పది ఇడ్లీలకు సరిపడేంత
నెయ్యి: 2tbsp
పచ్చికొ బ్బరి తురుము: 1/2cup
చెర్రీస్: 6
క్యారట్ తురుము: 1/2cup
తేనె: 4tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా ఇడ్లీ పిండిని ఇడ్లీ ప్లేట్లలలో వేసి స్టౌ మీద ఉంచాలి. తర్వాత మూత పెట్టి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
2. ఇడ్లీలు సగం ఉడికిన తరువాత ఒకసారి మూత తీసి, కట్ చేసి ఉంచుకున్న డ్రైఫ్రూట్స్ ముక్కలు ఇడ్లీల మీద వేసి మళ్లీ మూత పెట్టేయాలి.
3. బాగా ఉడికిన ఇడ్లీలను టిఫిన్ ప్లేట్లలోకి తీసుకొని పైన కొద్దికొద్దిగా నెయ్యి వేసి దాని మీద క్యారట్ తురుము, కొబ్బరి తురుము, తేనె వేసి, చెర్రీస్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. వీటిని పిల్లలు బాగా ఇష్టపడతారు. అంతే కాదు పిల్లల టిఫిన్, లంచ్ బాక్స్ లకు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ ఇడ్లీ బాగా నప్పుతుంది.



Click it and Unblock the Notifications
