Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
హాట్ అండ్ స్పైసీ చిల్లీ పనీర్ రిసిపి
సాధారణంగా ఇతర దేశాలతో పోల్చితే మన ఇండియాలో ఎక్కువ కారం తింటారు. మరీ ముఖ్యంగా ఆంధ్రాలో ఎక్కువ స్పైసీ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. చాలా వరకూ స్పైసీ ఫుడ్ తినడానికి ఇష్టపడుతారు. అందుచేతనే ప్రస్తుత రోజుల్లో రోడ్ సైడ్ స్టాల్స్ ఎక్కువగా ఉండటం చూస్తున్నాం. రోడ్ సైడ్ స్టాల్స్ లో కాస్త స్పైసీ ఐటమ్స్ అందుబాటులో ఉండి మన టేస్ట్ బడ్స్ ను కొత్తగా ఉత్తేజపరిచే రుచులను అందిస్తుంటారు.
సాధారణంగా చైనీస్ ఫుడ్ స్పైసీ తక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ మనం చైనీస్ కుషన్ ను మన ఇండియన్ టేస్ట్ కు తగ్గట్టు స్పైసీగా కొన్ని ఇండియన్ మసాలా దినుసులతో తయారుచేస్తున్నాం. అందుకే దీన్ని ఇండో చైనీ కుషన్ అంటాము . ఈ ఇండో చైనీ కుషన్ ప్రత్యేకతేంటంటే చిల్లీ పనీర్ డిష్ చీల్లీ పనీర్ అందరీకి నచ్చిన స్పైసీ వంటకం. వెజిటేరియన్స్ అయినా, నాన్ వెజిటేరియన్స్ అయినా ఇద్దరూ వీటిని ఇష్టపడుతారు. సాఫ్ట్ గా ఉండే కాటేజ్ చీజ్ తో తయారుచేసే ఈ స్పైసీ ఫుడ్ మీరు కూడా టేస్ట్ చేయాలంటే ట్రై చేసి చూడండి...

కావల్సిన పదార్థాలు:
పనీర్-500gms
కార్న్ ఫ్లోర్ : 2tbsp
ఉప్పు : రుచికి సరిపడా
బ్లాక్ పెప్పర్ పౌడర్: ½ tsp
వెల్లుల్లి రెబ్బలు: 5(పేస్ట్ చేసుకోవాలి)
ఉల్లిపాయలు: 2(సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కాప్సికమ్ : 2 (సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పచ్చిమిర్చి: 4 (మద్యలోకి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
వెజిటబుల్ స్టాక్: ½ cup(కూరగాయలు ఉడికించిన నీరు)
సోయ్ సాస్ - 2tbsp
గ్రీన్ చిల్లీ సాస్: 1tbsp
టమోటో సాస్: 1tbsp
Ajinomoto: చిటికెడు
ఆయిల్: డీఫ్ ఫ్రై చేయడానికి
ఆయిల్: 2tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కార్న్ ఫ్లోర్, ఉప్పు, బ్లాక్ పెప్పర్, కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా కలుపుకోవాలి.
2. ఇప్పుడు డీఫ్ ప్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి నూనె వేసి వేడి చేయాలి.
3. తర్వాత అందులో పనీర్ ముక్కలను కార్న్ ఫ్లోర్ మిశ్రమంలో డిప్ చేసి కాగే నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చే వరకూ డీప్ ఫ్రౌ చేసుకోవాలి.
4. ఇలా ఫ్రై చేసుకొన్న వాటని పేపర్ టవల్లో వేసి పక్కన పెట్టుకోవాలి.
5. తర్వాత మరో పాన్ లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకటి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
6. అందులోనే ఉల్లిపాయ మరియు క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి మీడియం మంట మీద ఫ్రై చేసుకోవాలి.
7. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మెత్తగా వేగిన తరవ్ాత అందులో పచ్చిమిర్చిముక్కలు వేసి వేగించి, వెంటనే వెజిటేబు్ స్టాక్ మరియు ఉప్ప కూడా వేసి బాగా ఉడికించాలి.
8. తర్వాత అందులో అజినామోటో, సోయా సాస్, టమోటో సాస్, చిల్లీ సాస్ వేసి మరో 5 నిముషాలు మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
9. తర్వాత అందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ అరకప్పు నీటిలో వేసి బాగా మిక్స్ చేసి, ఉడుకుతున్న మిశ్రమంలో పోసి బాగా మిక్స్ చేయాలి.
10. మొత్తం నీరు డ్రై అయ్యే వరకూ మరో 5నిముషాలు ఉడికిన తర్వాత అందులో పనీర్ ముక్కలు వేసి బాగా మిక్స్ చేయాలి.
11. మొత్తం ఉడికిన ఫ్రై అవుతున్న సమయంలో స్టౌ ఆఫ్ చేయాలి. అంతే హాట్ అండ్ స్పైసీ చిల్లీ పనీర్ రిసిపి రెడీ.



Click it and Unblock the Notifications