Latest Updates
-
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు?
రుచికరమైన నువ్వుల నూడుల్స్ తయారీ..!
నూడుల్స్‌ని మనందరమూ తినాలనుకుంటాము.పైగావీటిని రకరకాలుగా తయారు చేయవచ్చు.హాంకాంగ్ స్టైల్ నూడుల్స్ కారంగా ఉంటే కాంటోనీస్ స్టైల్ నూడుల్స్ కారం లేకుండా లైట్‌గా ఉంటాయి.
నూడుల్స్‌ని మనందరమూ తినాలనుకుంటాము.పైగావీటిని రకరకాలుగా తయారు చేయవచ్చు.హాంకాంగ్ స్టైల్ నూడుల్స్ కారంగా ఉంటే కాంటోనీస్ స్టైల్ నూడుల్స్ కారం లేకుండా లైట్‌గా ఉంటాయి.
మామూలు నూడుల్స్‌కే కాస్త మార్పులు చేసి రుచికరంగా మార్చే సీసమే నూడుల్స్ తయారీ మీకు ఈరోజు పరిచయం చెయ్యబోతున్నాము.దీనిని ఈవెనింగ్ స్నాక్‌గా తీసుకోవచ్చు పైగా దీని తయారెకై కావాల్సిన పదార్ధాలు కూడా సులభంగా దొర్కేవే.ఇక తయారీ విధానం, కావాల్సిన పదార్ధాలు చూద్దామా.
సీసమే సీడ్స్ లేదా నువ్వులు బలవర్ధకమైన ఆహారం. కనుక మీరు వీటిని నూడుల్స్తో కలిపి తీసుకుంటే మీ నాలుకకి రుచికరం మరియూ మీ శరీరానికి కూడా మంచిది.
ఎంత మందికి సరిపోతుంది-4
పదార్ధాలు సమకూర్చుకోవడానికి-15 నిమిషాలు
వండటానికి-20 నిమిషాలు.
కావాల్సిన పదార్ధాలు:
1.ఉడికించిన నూడుల్స్-2.5 కప్పులు
2.సన్నగా తరిగిన వెల్లుల్లి-1 టేబుల్ స్పూను
3.తెల్ల నువ్వులు-1 టేబుల్ స్పూను
4.సన్నగా తరిగిన అల్లం-1 టేబుల్ స్పూను
5.వెనిగర్-1 టేబుల్ స్పూను
6.ఉల్లికాడల తరుగు-1 టేబుల్ స్పూను
7.డార్క్ సోయా సాస్-1 టీ స్పూను
8.నువ్వుల నూనె-1 టేబుల్ స్పూను
9.ఉప్పు-రుచికి తగినంత
తయారీ విధానం:
1.నువ్వులని కనీసం రెండు నిమిషాల పాటు సన్నని మంట మీద నూనె లేకుండా వేయించి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి.

2.ఇప్పుడు అదే మూకుడులో నువ్వుల నూనె వేసి దానిలో అల్లం,వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి.

3.అల్లం, వెల్లుల్లి వేగాకా దానిలో ఉడికించిన నూడుల్స్, సోయా సాస్, వెనిగర్ వెయ్యాలి.

4.ఇప్పుడు బాగా కలిపి పైన వేయించిన నువ్వులు కలపాలి.కాసిని నువ్వులు గార్నిషింగ్ కోసం పక్కన పెట్టుకోవడం మర్చిపోవద్దు సుమా.

5.ఇప్పుడు మళ్ళీ కలిపి కాసేపు స్టవ్ మీదే ఉంచాలి.
6.నూడుల్స్ ఇతర పదార్ధాలతో కలిసి బాగా ఉడికాకా నూడుల్స్‌ని నూడుల్స్ బౌల్లోకి తీసుకోవాలి.

7.వీటిమీద ఉల్లి కాడల తరుగు, గార్నిషింగ్ కోసం పెట్టుకున్న నువ్వులూ చల్లాలి.

8.అంతే మీ సీసమే నూడుల్స్ రెడీ.

మీ పిల్లలకి రుచికరమైన కారం లేని నూడుల్స్ కావాలనుకుంటే ఇది మంచి ఎంపిక. దీనికే మీరు కూరగాయల ముక్కలు, చికెన్ చేర్చి మరింత రుచికరంగా మార్చవచ్చు. మరి ఆలశ్యమెందుకు, ప్రయత్నించి చూడండి.



Click it and Unblock the Notifications