Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి.. గర్భిణులు, పీసీఓఎస్ ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
మండుటెండల్లో కిడ్నీలకు ముప్పు.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ రెసిపీ.. టేస్టీ అండ్ హెల్తీ సొరకాయ దహీ తడ్కా -
లివ్-ఇన్ రిలేషన్షిప్లో బ్రేకప్ అయ్యిందా? ఇకపై క్రిమినల్ కేసులు పెట్టడం అంత సులభం కాదు! -
నోరూరించే మామిడికాయ పచ్చడి..ప్రెషర్ కుక్కర్ లో అప్పటికప్పుడు ఈజీగా చేసేయండిలా.. -
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బనానా లస్సీ.. ఇలా చేస్తే టేస్ట్ అదిరిపోద్ది! -
డేటింగ్ యాప్స్‌లో కొత్త రకం ఉచ్చు.. మీ ప్రైవేట్ వీడియోలతో బ్లాక్మెయిల్ చేస్తున్నారా? -
పొద్దున్నే లేవగానే ఒళ్లంతా నొప్పులా? కండరాలు పట్టేస్తున్నాయా? ఆ వ్యాధులకు సంకేతమే! -
సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగేలేదు! -
పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా..వైరల్ ఫిష్ ఫ్రై ఈజీగా ఇలా చేసేయండి
వీకెండ్ స్పెషల్ కడై పనీర్: వెజిటేరియన్ స్పెషల్
రెగ్యులర్ వంటలతో విసుగు చెందారు. ఒక మంచి రుచికరమైన స్పైసీ వంటను, రెస్టారెంట్ స్టైల్ వెజిటేరియన్ వంటను మీరు ఇంట్లో తయారుచేసుకోవాలనుకుంటున్నారా?మరి అయితే ఒక్కడ ఒక అద్భుతమైన రుచికల రెస్టారెంట్ వంట టేస్ట్ ను మీ టేస్ట్ బడ్స్ కు రుచిచూపించే కడై పనీర్ వంటకాన్నీ మీకు పరిచయం చేస్తున్నాం.
ఈ కడై పనీర్ తయారు చేయడం చాలా సులభం మరియు త్వరగా తయారవుతుంది. ఈ స్పెషల్ కడై పనీర్ రైస్ మరియు చపాతీలకు చాలా అద్భుతంగా ఉంటుంది . మరి మీరు ఈ వారాంతంలో ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే...కడై పనీర్ ఎందుకు ట్రై చేయకూడా...ట్రై చేయండి. కొత్తరుచిని ఎంజాయ్ చేయండి...

కావలసినపదార్థాలు:
పనీర్: 400 గ్రా. (ముక్కలుగా కట్ చేయాలి)
క్యాప్సికమ్ : 1(ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ఉల్లి తరుగు : 1/2 cup
ఉల్లిముక్కలు : 1/2 cup(పెద్దవిగా తరగాలి)
టొమాటో తరుగు : 1/2 cup
పసుపు : చిటికెడు
కారం: 1tsp
కొత్తిమీర : కట్ట
పచ్చిమిర్చి : 5
మిరియాలపొడి : 1/2tsp
గరంమసాలా : 1/2tsp
ఉప్పు : తగినంత
బ్లాక్ సాల్ట్ : చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : టీ స్పూను
షాజీరా : 1/2tsp
డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం:
పల్లీలు : 10grm
జీడిపప్పు : 4-5
కర్బూజా గింజలు : 10grm
బాదంపప్పు : 10grm
నూనె : సరిపడా
(డ్రైఫ్రూట్స్‌ని వేయించి చల్లారాక కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి)
తయారుచేయు విధానం :
1. ముందుగా పాన్ లో నూనె వేసి, కాగనివ్వాలి, నూనె వేడయ్యాక అందులో షాజీరా, ఎండుమిర్చి, ఉల్లి తరుగు వేసి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ లోకి మారే వరకూ వేగించుకోవాలి.
2. ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ లో మెత్తగా వేగిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పయే వరకూ వేయించాలి.
3. తర్వాత టొమాటో ముక్కలు, మిగిలిన పదార్థాలన్నీ ఒకదానికి తర్వాత ఒకటి వేసి మరికొద్దిసేపు వేయించాలి.
4. మసాలా మిశ్రమం అంతా బాగా వేగి, నూనె పైకి తేలుతున్నప్పుడు అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి నిధానంగా మిక్స్ చేయాలి.
5. బాగా వేగిన తరవాత పనీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ కూడా వేసి నిధానంగా కలుపాలి. తర్వాత ఈ మెత్తం మిశ్రమాన్ని ఐదు నిముషాలు ఉడికించాలి.
6. కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌చేసి సర్వ్ చేయాలి. అంతే మీ కడాయ్ పనీర్ రెడీ. ఈ కడై పనీర్ ను ఒక చిన్న కలర్ఫుల్ బౌల్లో మీ అతిథులకు సర్వ్ చేయాలి. కడైపనీర్ వేడి వేడి సర్వ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది. ఈ రుచికరమైన వంటను వెజిటేరియన్స్ మరియు నాన్ వెజిటేరియన్స్ ఇద్దరూ ఇష్టపడుతారు.



Click it and Unblock the Notifications