Latest Updates
-
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే! -
ఒక్క చుక్క నూనె లేకుండా స్ట్రీట్ స్టైల్ రగడా చాట్.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్! -
JEE అడ్వాన్స్డ్ 2026 రిజిస్ట్రేషన్ మొదలైంది.. ఇంజనీరింగ్ సీటు మీ సొంతం కావాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
రొటీన్ ఇడ్లీ, దోశలు బోర్ కొట్టాయా? అయితే ఈ కమ్మటి వెజిటబుల్ ఎగ్ సేమియా ట్రై చేయండి!
కాశ్మిరి దమ్ ఆలూ స్పైసీ అండ్ టేస్టీ
బంగాళదుంపలు చాలా ఫేవరెట్ వెజిటేబుల్. స్పైత్ దమ్ ఆలూ కాశ్మీరి స్టైల్లో తయారుచేస్తే మరింత రుచికరంగా ఉంటుంది. ఈ దమ్ ఆలూ కాశ్మీర్ లో చాలా ప్రసిద్ది .
బేబీ పొటాటాలతో తయారుచేసే ఈ కాశ్మిరి దమ్ ఆలూ, పొటాటోను ఫ్రై చేసి, పెరుగు గ్రేవీతో ఉడికించి చేస్తారు. ఫ్రై చేయకుండా ఉడికించుకొని కూడా గ్రేవీతో మిక్స్ చేయవచ్చు. అయితే ఫ్రై చేస్తే మరికొంత అదనపు టేస్ట్ ను మరియు మంచి స్ట్రక్చర్ ను అందిస్తుంది. మరి ీ స్పైసీ కాశ్మిరీ దమ్ ఆలూను ఎలా తయారుచేయాలో చూద్దాం....

కావల్సిన పదార్థాలు:
బేబీ బంగాళాదుంపలు 500gms
నూనె: 3tbsp మరియు ఫ్రై చేయడానికి సరిపడా
ఉల్లిపాయ: 1cup(సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tsp
పెరుగు : 2 cups(బాగా చిలికించి పెట్టుకోవాలి)
కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్రం: 1tsp
పసుపు: 1/4 tsp
జీలకర్ర పొడి: 1/2 tsp
సోంపు పొడి: 1tbsp
గరం మసాలా: 1/2tsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారుచేయు విధానం:
1. ముందుగా బంగాళదుంపలను మీడియం సైజ్ లేదా బేబీ పొటాలను ఎంపిక చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక గిన్నెలో నీళ్ళు పోసి, అందులో ఉప్పు వేసి, బంగాళదుంపలను వేసి ఒక విజిల్ వచ్చే వరకూ ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలి .
3. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, బంగాళదుంపలలోని వేడినీళ్ళు వంపేసి, చల్లటి నీళ్ళు పోసి, అవికూడా వంపేసి, వాటినికి పొట్టుతీసి పక్కన పెట్టుకోవాలి.
4. ఇప్పుడు ఫ్రైయింగ్ పాన్ పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో బంగాళదుంపలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి.
5. ఇప్పుడు ఒక మంద పాటి డీప్ బాటమ్ పాన్ లో మూడు చెంచాలా నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ వేయించుకోవాలి.
6. తర్వాత అందులో నే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మరో 5నిముషాలు వేయించుకోవాలి.
7. ఇప్పుడు పెరుగులో పసుపు, కాశ్మిరీ రెడ్ చిల్లీ పౌడర్, జీలకర్ర, ఉప్పు, మరియు సోంపు వేసి బాగా మిక్స్ చేయాలి.
8. స్టౌ మీద నుండి పాన్ క్రిందికి దింపుకొని, అందులో పెరుగు మిశ్రమాన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
9. ఇప్పడు తిరిగా పాన్ స్టౌ మీద పెట్టి, అందులో ఒక కప్పు నీళ్ళు పోసి వేడి చేయాలి. ఇప్పుడు అందులో బంగాళదుంపలు వేసి, మూతపెట్టి ఉడికించుకోవాలి.
10. తర్వాత గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసి మరో రెండు మూడు నిముషాలు ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే కాశ్మిరీ దమ్ ఆలూ రెడీ. నాన్ మరియు రోటీలకు బెస్ట్ కాంబినేషన్.



Click it and Unblock the Notifications