Latest Updates
-
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా!
ఆహా నోరూరించే పనీర్ అండ్ రాజ్మా కర్రీ
పనీర్ అండ్ రాజ్మా రెండూ బాగా పాపులర్ అయిన ఫుడ్ ఐటమ్స్. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ కు చాలా ఫేమస్. ఈ రెండింటి కాంబినేషన్ లో తయారుచేసే వంటి చాలా రుచికరంగా ఉంటుంది.
ఈ కాంబినేషన్ డిష్ తయారుచేయడానికి ముందుగా రాజ్మాను 4గంటల పాటు నీటిలో వేసి నానబెట్టుకోవాలి . దాని తర్వాత రాజ్మాను ఉడికించుకోవాలి . రాజ్మాను ఉడికించేటప్పుడు అందులో ఉప్పు మరియు పచ్చిమిర్చి వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. రుచి, మంచి ఫ్లేవర్ ఉన్న ఈ సాప్ట్ అండ్ క్రీమి డిష్ ను ఎలా తయారుచేయాలో చూద్దాం...

కావల్సిన పదార్థాలు:
రాజ్మా : 1 &1/2 cup
పనీర్ : 150 gms
ఉల్లిపాయ : 2 (చిన్న ముక్కలుగా తరిగాలి)
టొమాటో : 2 (సన్నగా తరిగినవి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 2tbsp
పసుపు : 1/2 tsp
కారం : 1/2tsp
ధనియాల పొడి : 1 tsp
జీలకర్ర : 1/2 tsp
గరం మసాల : 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె : తగినంత
తయారుచేయు విధానం:
1. ముందుగా రాజ్మాను ఉడికించుకోవాలి. ఉడికించిన నీటిని పక్కన తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత మిక్సీలో ఉల్లిపాయలు మరియు టమోటో వేసి మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర వేగిన తర్వాత అందులో ఉల్లిపాయ పేస్ట్ వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.
4. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకూ ఫ్రై చేసుకోవాలి.
5. ఇప్పుడు అందులో టమోటో గుజ్జు కూడా వేసి ఫ్రై చేయాలి. తర్వాత అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసి మీడియం మంట మీద ఉడికించుకోవాలి.
6. ఫ్రై చేస్తున్నప్పుడు, నూనె పైకి తేలి పోపు పచ్చివాసన పోయే వరకూ ఉడికించుకోవాలి.
7. ఇప్పుడు అందులో పన్నీర్ ముక్కలు వేసి 5నిముషాలు ఫ్రై అయిన తర్వాత అందులో రాజ్మా ఉడికించిన నీటిని పోసి బాగా మిక్స్ చేయాలి.
8. పన్నీ మెత్తగా ఉడికే సమయంలో అందులో రాజ్మ, మరియు గరం మసాలా కూడా వేసి మంటను మీడియంగా పెట్టి ఉడికించుకోవాలి. 10నిముషాలు ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి. అంతే నోరూరించే పనీర్ మరియు రాజ్మా కర్రీ రిసిపి రెడీ..



Click it and Unblock the Notifications