Latest Updates
-
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్: తారల సందడితో హోరెత్తుతున్న వేదిక.. ఫోటోలు వైరల్! -
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు -
ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే పడేయకుండా ఇలా రుచికరమైన బ్రెడ్ ఉప్మా చేసేయండి! -
ఎండల దెబ్బకు మారుతున్న పెళ్లిళ్ల ముహూర్తాలు.. అసలు ఏం జరుగుతోంది? -
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026 -
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి! -
బాడీలో అవయువాలన్నీ రిపేర్ చేసే అద్భుతమైన ఆకు కూర..ఎలా వండాలో చూడండి
బెస్ట్ ఇండియన్ సైడ్ డిష్-ఆనియన్-గార్లిక్ రైతా

రైతా స్వీట్ కానివ్వండి, హాట్ కానివ్వండి ఏదైనా సరే రోటీ, రైస్, పులావ్, బిర్యానీలకు బెస్ట్ కాంబినేషన్. రైతా తయారు చేసిన తర్వాత రుచి చూసిన తర్వాత ఈ టేస్ట్ ను కొద్దికాలం పాటు మరచిపోలేరు. ఇది తాయారు చేయడం కూడా సులభం. మీరు కుకుంబర్ రైతాను చాలా సార్లు చేసుకొని ఉంటారు. అందుకే మసాలాదినుసులతో తయారు చేసే రైతా ఎలా ఉంటుందో మీరూ తాయారు చేసి రుచి చూడండి....
కావల్సిన పదార్థాలు:
పెరుగు: 2cups
ఉల్లిపాయలు: 1(చిన్నగా కట్ చేసుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 7-8
పచ్చిమిర్చి: 2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
కారం: 1tsp
జీలకర్ర: ½tsp
బ్లాక్ సాల్ట్: చిటికెడు
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2tbsp(గార్నిషింగ్ కోసం)
నూనె: ½tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద ఫ్రైయింగ్ పాన్ పెట్టి మీడియం మంట పెట్టాలి. పాన్ వేడవ్వగానే అందులో జీలకర్ర వేసి రెండు మూడు నిముషాలు వేయించుకోవాలి. పక్కకు తీసి చల్లారిన తర్వాత రోలింగ్ స్టోన్ మీద వేసి రోలర్ తో రుద్ది పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో పెరుగు కొద్దిగా నీళ్ళు వేసి బాగా గిలకొట్టాలి. ఇప్పుడు అందులోని వేయించుకొన్న వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, బ్లాక్ సాల్ట్ మరియు జీలకర్ర పొడి వేసి బాగా మిక్స్ చేయాలి.
3. ఇలా తయారు చేసుకొనేలోపు పాన్ లో ఒక టీస్పూన్ నూనె వేసి, వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు నిముషాలు వేగించాలి. తర్వాత కొద్దిగా కారం, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగించిన తర్వాత వెంటనే ముందుగా కలిపి పెట్టుకొన్న పెరుగు మిశ్రమాన్ని ఇందులో పోయాలి. అంతే ఉల్లిపాయ వెల్లుల్లి రైతా రెడీ. దీన్ని వేడి వేడిగా సర్వ్ చేయవచ్చు.



Click it and Unblock the Notifications